అంతర్జాతీయం

దలైలామా వేర్పాటువాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, అక్టోబర్ 21: బౌద్ధుల మత గురువు దలైలామాపై చైనా తీవ్ర పదజాలంతో విరుచుకుపడింది. దలైలామా ఓ వేర్పాటువాదని, ఆధ్యాత్మికవేత్త ముసుగులో చైనా నుంచి టిబెట్‌ను విడదీయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని బీజింగ్ ధ్వజమెత్తింది. ఏ దేశం అయినా లేక విదేశీనేత అయినా దలైలామాతో సమావేశమైనా, కలిసినా ‘తీవ్రమైన నేరం’గానే పరిగణిస్తామని చైనా తీవ్రంగా హెచ్చరించింది. దలైలామాకు మద్దతునిస్తున్న నేతలపై చైనా విమర్శలు చేసింది. ‘టిబెట్ చైనాలో అంతర్భాగమే. ఈ విషయాన్ని అన్ని దేశాలూ గుర్తించాల్సిందే. బీజింగ్‌తో దౌత్యపరమైన సంబంధాలు కలిగిఉన్న అన్ని దేశాలూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి’ అని స్పష్టం చేసింది. దలైలామా ఇటీవల భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల పర్యటననూ చైనా తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. హిమాలయ ప్రాంతంలో చైనా పెత్తనానికి నిరసనగా 1959లో దలాలామా టిబెట్‌ను వదిలి వెళ్లిపోయారు. చాలాఏళ్లు భారత్‌లో అజ్ఞాత జీవితం గడిపారు. సందర్భం వచ్చినప్పుడల్లా దలైలామాపై చైనా ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తూనే ఉంది. శనివారం మరోసారి బౌద్ధ గురువుపై పెద్దఎత్తున దాడికి దిగింది. ‘ప్రపంచంలో ఏ దేశమైనా లేదా ఓ విదేశీ సంస్థ అయినా దలైలామాను కలిసినా, ఆహ్వానించినా మా దృష్టిలో పెద్ద నేరం కిందే లెక్క. చైనా ప్రజల మనోభావాలను ఎవరైనా గౌరవించి తీరాల్సిందే. ఈ విషయంలో మూడో దేశం జోక్యాన్ని ఎంతమాత్రం సహించబోం’ అని అధికార కమ్యూనిస్టు పార్టీ ఎగ్జిక్యుటివ్ ఉప మంత్రి ఝాంగ్ యిజియాంగ్ హెచ్చరించారు. తమ దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకోవడం తమకు తెలుసని, దానికి వ్యతిరేకంగా పనిచేసే సంస్థ లేదా వ్యక్తులను ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. ఐదేళ్లకోసారి జరిగే కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా మహాసభల సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. 82 ఏళ్ల దలైలామా గురించి విదేశీ నేతలు చేసే ఎలాంటి వాదనలతోనూ తమకు సంబంధం లేదని, అలాంటి వాటిని తాము అంగీకరించబోమని ఝాంగ్ తేల్చిచెప్పారు. ‘ఆయన రాజకీయ నేతగా వేషం మార్చుకుని లామాల చరిత్రను మంటగలిపారు. 1959లో దేశం విడిచివెళ్లిపోయి మాతృభూమిని మోసం చేశారు’ అని ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. మరోదేశం పంచన చేరి టిబెట్‌ను విడదీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. భారత్ పేరును ప్రత్యక్షంగా ఎక్కడా ప్రస్తావించకపోయినా పొరుగుదేశం అంటూ విమర్శలు చేశారు. వేర్పాటువాద అజెండాతో దలైలామా పనిచేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. దలైలామాను తాము రాజకీయ నాయకుడిగా చూడడం లేదని ఓ ఆధ్యాత్మికవేత్తగానే పరిగణిస్తున్నామంటూ విదేశీ నాయకులు కొందరు చేస్తున్న ప్రకటనలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన అన్నారు. టిబెట్ బౌద్ధమతం పుట్టిందే చైనాలోనని ఆయన స్పష్టం చేశారు.