అంతర్జాతీయం

షింజోకే మళ్లీ పట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, అక్టోబర్ 23: జపాన్ జాతీయ ఎన్నికల్లో ప్రధాని షింజో అబే సారథ్యంలోని లిబరల్ డెమొక్రటిక్ పార్టీ మూడింట రెండొంతుల మెజార్టీతో ఘన విజయం సాధించింది. మొత్తం 465స్థానాలు కలిగిన పార్లమెంట్ దిగువ సభలో మరో చిన్న భాగస్వామ్య పక్షంతో కలిసి 312 సీట్లను గెలుచుకుంది. ఈ విజయంతో లిబరల్ డెమొక్రటిక్ పార్టీ నాయకుడిగా మరో మూడేళ్ల పాటు షింజో అబే ఎన్నికయ్యే అవకాశాలు మరింతగా బలపడ్డాయి. అది జరిగితే 2021 వరకూ దేశ ప్రథానిగా ఆయనే కొనసాగే అవకాశం ఉంటుంది. అలాగే జపాన్ పాసిఫిస్ట్ రాజ్యాంగాన్ని సవరించేందుకూ ఈ విజయం షింజేకు మరింతగా దోహదం చేస్తుంది. ఉత్తర కొరియాపై మరింత కరకుగా వ్యవహరించడం, అమెరికాతో సత్సంబంధాలను కొనసాగించే విషయంలో ఎలాంటి మార్పు లేకుండా షింజే ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. జపాన్ ఓటర్లు తన విధానాలను పూర్తిగా సమర్థించారని చెప్పడానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అబే అన్నారు. అలాగే తన రాజకీయ నాయకత్వమే కొనసాగాలని వారు కోరుకుంటున్నట్టుగా కూడా ఈ మెజార్టీ తీర్పు స్పష్టం చేస్తోందని తెలిపారు.