అంతర్జాతీయం

ఉగ్రమూకల్ని వేటాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 27: ‘ఉగ్ర సంస్థల నిరోధానికి మీ పద్ధతిలో మీరు చర్యలు తీసుకోండి. లేదంటే, మా పద్ధతిలో మేం ముదుకెళ్లాల్సి ఉంటుంది’ అని పాకిస్తాన్‌ను అమెరికా హెచ్చరించింది. ఉగ్రమూకల్ని తుదముట్టించేందుకు ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని, లేదంటే పాక్ విషయంలో అమెరికా అనుసరణీయ వ్యూహాలు మారతాయని హెచ్చరించింది. పాక్ గడ్డపై ఉగ్ర సంస్థలు ఏర్పాటు చేసుకున్న రక్షణ కేంద్రాలను తక్షణం తుడిచేయాలని పాక్ పర్యటనలో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్ గట్టిగానే సూచించారని అధికార ప్రతినిధి హెదర్ నౌర్ట్ వెల్లడించారు. రెక్సె టిల్లర్‌సన్ ఆఫ్గాన్, పాక్, భారత్ పర్యటన ముగించిన 24 గంటలు తిరగకుండానే ఈ ప్రకటన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మూడు దేశాల పర్యటన ముగించుకున్న రెక్స్ టిల్లర్‌సన్, జెనీవాలో మీడియాతో మాట్లాడారు. ‘పాక్ గడ్డపైవున్న ఉగ్ర శిబిరాలను తుదముట్టించాలన్న మా ఉద్దేశాన్ని ఇప్పటికే మీ దృష్టికి చాలాసార్లు తీసుకొచ్చాం’ అని స్పష్టం చేశామన్నారు. ‘ఉగ్రవాద సమాచారం ఇచ్చిపుచ్చుకునే విషయంలో మేం స్పష్టంగా ఉన్నాం. మీరు కూడా అదే పద్ధతి అనుసరిస్తుందని ఆశిస్తున్నాం’ అని పాక్ పాలకులకు స్పష్టం చేశామన్నారు. ‘మీకు మేం చేయగలమో అది చేస్తున్నాం. ఆ విషయంలో మీనుంచీ అంతే చొరవ ఆశిస్తున్నాం. మీ సార్వభౌమత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి డిమాండ్లూ పెట్టడం లేదు. మా ఉద్దేశాలను అర్థం చేసుకుని, ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి. లక్ష్య సాధనలో మీరు విఫలమైతే, దాన్ని ఎలా నెరవేర్చుకోవాలో మాకు తెలుసు. అప్పటి నుంచీ పాక్ విషయంలో అమెరికా అనుసరిస్తున్న వ్యూహాలు మరోలా ఉంటాయి. ఆ తరువాత మీ ఇష్టం’ అని పాక్‌కు స్పష్టం చేసినట్టు చెప్పారు. పాక్ -అమెరికా విధానాలకు ఎలాంటి భంగం కలగని రీతిలోనే చర్చలు సాగించామని, పాక్‌తో చర్చలు తనకు ఇదే ప్రథమమన్నారు. అందుకే 80 శాతం వాళ్లు చెప్పిందే విన్నాను. నేను మాట్లాడిన 20 శాతం సమయంలో అమెరికా ఉద్దేశాలను ఎలాంటి సంకోచాలు లేకుండా కచ్చితంగా చెబుతూనే, వాళ్ల ఆలోచనలూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను అని టిల్లర్‌సన్ స్పష్టం చేశారు. ‘నా పర్యటనకు ఓ ప్రాధాన్యత ఉంది. భవిష్యత్‌లో మరోసారి పాక్‌లో పర్యటిస్తానా? లేదా? అనేది, ఉగ్రమూకల భరతం పట్టే విషయంలో అమెరికా ఆకాంక్షను పాక్ నెరవేర్చడంపైనే ఆధారపడి ఉంటుంది’ అని టిల్లర్‌సన్ వ్యాఖ్యానించారు. పాక్ ప్రధాని అబ్బాసీ, ఆయన పూర్తి కేబినెట్‌తో ఒకపరి, ఆర్మీ జనరల్ బజ్వా మరికొందరు సలహాదారులతో జరిపిన చర్చల్లో అమెరికా ఉద్దేశాలతో విస్పష్టంగా చెప్పినట్టేనని టిల్లర్‌సన్ చెప్పుకొచ్చారు. ‘కబుర్లతో కాలయాపన చేయాలని మేం అనుకోవడం లేదు. ఆ విషయానే్న పాక్‌కు కచ్చితంగా చెప్పాం. వాళ్లు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది వాళ్ల ఇష్టం. ఉగ్రమూకల విషయంలో అనుకున్నది జరగకపోతే మాత్రం, దాన్ని నెరవేర్చుకోడానికి మా ఆలోచనలు మాకుంటాయి. పాక్ విషయంలో అమెరికా ఆలోచనలు, వ్యూహాలు అందుకు అనుగుణంగా మారిపోతాయి’ అని టిల్లర్‌సన్ నిర్ద్వంద్వంగా వెల్లడించారు.

చిత్రం..అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్