అంతర్జాతీయం

యుద్ధాల్లో నెగ్గడానికి సన్నద్ధంగా ఉండండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, అక్టోబర్ 27: ‘అధికార కమ్యూనిస్టు పార్టీకి సంపూర్ణ స్థాయిలో విధేయతగా ఉండండి. యుద్ధాలలో నెగ్గడం ఎలా అనే అంశంపై కేంద్రీకరించడం ద్వారా యుద్ధ సన్నద్ధతను తీవ్రం చేయండి..’ ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యంగా, 2.3 మిలియన్ల మంది సిబ్బందితో కూడిన పటిష్ఠమైన మిలిటరీగా ఉన్న చైనా సాయుధ బలగాలను ఆ దేశాధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఇలా ఆదేశించారు. చైనా అధ్యక్షుడిగా మరో అయిదేళ్ల పదవీకాలానికి రెండోసారి బాధ్యతల నిర్వహణను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. చైనా కమ్యూనిస్టు పార్టీ (సిపిసి) మహాసభలు అయిదేళ్లకోసారి జరుగుతాయి. ఈ వారంలో జరిగిన మహాసభల్లో జిన్‌పింగ్ పార్టీకి, మిలిటరీకి నాయకత్వం వహించడానికి, మరోసారి అధ్యక్షుడిగా పనిచేయడానికి సిపిసి ఆమోదం తెలిపింది. జిన్‌పింగ్ సైద్ధాంతిక అంశాలను రాజ్యాంగంలో చేర్చడానికి కూడా పార్టీ ఆమోదం తెలిపింది. దీంతో జిన్‌పింగ్‌ను ఆధునిక చైనా వ్యవస్థాపక చైర్మన్ మావో జెడాంగ్, ఆయన రాజకీయ వారసుడు డెంగ్ జియావోపింగ్‌ల సరసన పార్టీ నిలిపింది. 64 ఏళ్ల జిన్‌పింగ్ తన రెండో విడత అధ్యక్ష పదవీ బాధ్యతల నిర్వహణను గురువారం ఉన్నత స్థాయి మిలిటరీ అధికారులతో సమావేశం నిర్వహించడం ద్వారా ప్రారంభించారు. చైనా మిలిటరీకి హైకమాండ్‌గా వ్యవహరించే శక్తివంతమైన సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సిఎంసి)కి జిన్‌పింగ్ నేతృత్వం వహిస్తున్నారు. సిఎంసిలో ఉన్న ఏకైక సివిలియన్ లీడర్ జిన్‌పింగ్. మిగతా వారంతా సాయుధ బలగాలకు చెందిన అధికారులే ఉంటారు. బుధవారం ఏర్పాటు చేసిన కొత్త సిఎంసికి ఏడుగురితో కూడిన బృందం నేతృత్వం వహిస్తుంది. అంతకు ముందు ఈ బృందంలోని వారి సంఖ్య 11గా ఉండింది. మిలిటరీలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని, యుద్ధ సన్నద్ధత శిక్షణను తీవ్రం చేయడాన్ని, విన్యాసాలను కొనసాగించాలని జిన్‌పింగ్ ఉన్నత స్థాయి మిలిటరీ అధికారుల సమావేశంలో చైనా సైన్యం అయిన ప్రజావిముక్తి సైన్యాన్ని (పిఎల్‌ఎను) ఆదేశించారని అధికార మీడియా తెలిపింది. జాతీయ రక్షణ వ్యవస్థలో సంస్కరణలను కొనసాగించాలని, భవిష్యత్తులో పిఎల్‌ఎ అభివృద్ధికి సంబంధించిన వ్యూహాత్మక అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలని కూడా జిన్‌పింగ్ సైనిక ఉన్నతాధికారులను ఆదేశించారు.