అంతర్జాతీయం

మళ్లీ అదే వరస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, నవంబర్ 2: చైనా మరోసారి తన దుర్నీతిని చాటుకుంది. భారత్‌లో జరిగిన అనేక ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న పాకిస్తాన్ టెర్రరిస్టును అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే ప్రయత్నాలను అడ్డుకుంది. అమెరికా, ఫ్రాన్స్, యుకెలు లష్కరే తోయిబాకు చెందిన పటాన్‌కోట్ దాడి సూత్రధారి మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస ప్రకటించాలని పట్టుబట్టాయి. అయితే ఈ అంశంపై ఏకాభిప్రాయం లేని కారణంగా దాన్ని తాము తిరస్కరించినట్లు చైనా స్పష్టం చేసింది. మసూద్ అజార్‌పై నిషేధం విధించాలంటూ గతంలో పలుమార్లు భారత్ ఐరాసను ఆశ్రయించింది. అన్ని ప్రయత్నాలను చైనా అడ్డుకుంటూనే వచ్చింది. ఇప్పటికే ఐక్యరాజ్య సమితి నిషేధించిన ఉగ్రవాద సంస్థల జాబితాలో అజార్ సారథ్యంలోని జైషే మహమ్మద్ కూడా ఉంది. అజార్ విషయంలో సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం లేని కారణంగానే అమెరికా, ఫ్రాన్స్, యుకెలు చేసిన ప్రతిపాదనను తాము తిరస్కరించామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సాంకేతికంగా అజార్‌పై చర్యకు సంబంధించి చైనా తీసుకున్న గడువు గురువారంతో ముగిసింది. అజార్‌కు సంబంధించిన తీర్మానాన్ని చైనా అడ్డుకోవడం వరుసగా ఇది రెండోసారి. గత ఏడాది కూడా ఐరాస భద్రతామండలిలోని 1267 కమిటీలో భారత్ ఈ ప్రతిపాదన చేసింది. అప్పట్లో కూడా చైనా మోకాలడ్డింది. అజార్‌పై చర్య విషయంలో మరింత విస్తృతంగా చర్చ జరగాలన్న ఉద్దేశంతోనే తాము తాజా అభ్యంతరాన్ని వ్యక్తం చేశామని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి చున్ యింగ్ తెలిపారు. ఇప్పటికీ ఈ అంశంపై ఏకాభిప్రాయమే లేదని స్పష్టం చేశారు. భద్రతా మండలికి చెందిన ఈ కమిటీ అధికారాన్ని, పట్టును పరిరక్షించాలన్న ఉద్దేశంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అయితే భవిష్యత్తులో కమిటీ సభ్యులతో కలిసి పనిచేయడానికి సమన్వయంతో వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కమిటీలో ఏకాభిప్రాయం లేనప్పుడు అజార్‌పై ఏకపక్షంగా ఎలా నిషేధం విధిస్తారని, అతడ్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఎలా ప్రకటిస్తారని ఆయన ప్రశ్నించారు.