అంతర్జాతీయం

స్వదేశానికి చేరిన నవాజ్ షరీఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, నవంబర్ 2: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తనపై నమోదయిన అవినీతి కేసులలో విచారణను ఎదుర్కొనేందుకు గురువారం స్వదేశానికి చేరుకున్నారు. పనామా పత్రాల కుంభకోణం వెలుగులోకి రావడంతో ఆయనపై అవినీతి కేసులు నమోదయిన విషయం తెలిసిందే. ఈ కేసుల్లో ఇరుక్కున్న షరీఫ్ ప్రధానమంత్రి పదవిని నిర్వహించేందుకు అనర్హుడని సుప్రీంకోర్టు జూలై 28న ఇచ్చిన తీర్పు కారణంగా, ఆయన ఆ పదవి నుంచి తప్పుకున్నారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్- నవాజ్ (పిఎంఎల్-ఎన్) అధినేత అయిన షరీఫ్ గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న తన భార్య కుల్సూమ్ నవాజ్‌కు తోడుగా ఉండటానికి గత నెలలో లండన్ వెళ్లారు. పనామా పత్రాల కుంభకోణానికి సంబంధించి నమోదయిన మూడు అవినీతి కేసులలో విచారణకు హాజరు కాని కారణంగా అకౌంటబిలిటి కోర్టు అక్టోబర్ 26న షరీఫ్‌కు బెయిలేబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది.
దీంతో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో లండన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారు. షరీఫ్‌పై నమోదయిన కేసులను కోర్టు శుక్రవారం విచారించనుంది. షరీఫ్, ఆయన కుమార్తె మార్యం, అల్లుడు కెప్టెన్ (రిటైర్డ్) మొహమ్మద్ సఫ్దార్‌లకు ఇప్పటికే సమన్లు జారీ అయ్యాయి. ఇస్లామాబాద్‌లోని షహీద్ బెనజీర్ భుట్టో అంతర్జాతీయ విమానాశ్రయంలో పాకిస్తాన్ అంతర్జాతీయ విమానయాన సంస్థకు చెందిన విమానం నుంచి దిగుతున్న షరీఫ్ ఫొటోలను అధికార పిటివి ప్రసారం చేసింది. అధికార పిఎంఎల్(ఎన్)కు చెందిన సీనియర్ నాయకులు ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు.
అనంతరం షరీఫ్ విమానాశ్రయంలోని విఐపి లాంజ్‌లో పార్టీ నాయకులతో కొద్ది సేపు సంప్రదింపులు జరిపారు. అనంతరం ఆయన తన ప్రైవేటు వాహనంలో ఇస్లామాబాద్‌లోని పంజాబ్ హౌస్‌కు వెళ్లారు. అక్కడ ఆయనకు పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు ఘనస్వాగతం పలికారు. ‘తప్పుడు కేసుల’లో విచారణను ఎదుర్కొనేందుకు తాను పాకిస్తాన్‌కు తిరిగి వెళ్తున్నానని అంతకు ముందు షరీఫ్ లండన్‌లో మీడియాకు చెప్పారు.