అంతర్జాతీయం

ఆ నరహంతకుడికి మరణదండనే సరైనది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 2: న్యూయార్క్ నగరంలో ట్రక్‌తో ఢీకొట్టి ఎనిమిదిమందిని పొట్టన పెట్టుకున్న సెఫుల్లో సైపోవ్ (ఉజ్బెకిస్థాన్)కు మరణ దండన విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ‘ఐసిస్’ భావజాలాన్ని జీర్ణించుకున్న 29 ఏళ్ల సైపోవ్ న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద బుధవారం ట్రక్‌తో ఢీకొనడంతో ఎనిమిది మంది మరణించగా సుమారు డజను మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఐసిస్ జెండాను తాను చికిత్స పొందుతున్న ఆస్పత్రి గదిలో ఎగరవేయాలని కోరిన ఈ నరహంతకుడికి మరణ శిక్ష విధించాలని ట్రంప్ ట్వీట్ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, అమెరికాకు వలస వచ్చే వారిపట్ల ‘ప్రతిభ ఆధారిత’ విధానాలను అమలు చేయాలని, వీసా నిబంధనల్లో ఎలాంటి వైరుధ్యాలు ఉండరాదని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ‘డైవర్సిటీ వీసా లాటరీ కార్యక్రమం’లో హంతకుడు సైపోవ్ తమ దేశానికి వలస వచ్చాడని, ఇకనైనా ప్రతిభ ఆధారంగా విధానాలను మార్చాలని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, పౌరులకు గరిష్ట స్థాయిలో హాని జరిగేలా దాడి చేశానని సైపోవ్ గురువారం నాడు ప్రాసిక్యూటర్ల ముందు అన్నట్లు తెలిసింది. ఎఫ్‌బిఐ, న్యూయార్క్ పోలీసులు ఈ ఉగ్రదాడిపై సంయుక్తంగా విచారణ చేపట్టారు. తనిఖీలను ఉద్ధృతంగా చేపట్టాలని, అనుమానితుడిని క్యూబాలోని ఉగ్రవాదుల నిర్బంధ కేంద్రానికి పంపాలన్న ప్రతిపాదనను ట్రంప్ సమర్థించారు.
సైపోవ్‌పై నేరారోపణలు
న్యూయార్క్‌లో ఎనిమిదిమందిని బలిగొన్న సైపోవ్‌పై అమెరికా పోలీసు అధికారులు ఉగ్రవాద నేరారోపణలను నమోదు చేశారు. ఉగ్రవాద సంస్థ ‘ఐసిస్’కు మద్దతుదారుగా ఉంటున్న నిందితుడు హింసాకాండకు, వాహనాల విధ్వంసానికి పాల్పడినట్లు అభియోగాలు నమోదు చేశారు. ట్రక్‌తో స్కూల్ బస్సును ఢీకొని ఇతను తన ప్రణాళికను అమలు చేశాడు. పోలీస్ కాల్పుల్లో గాయపడిన సైపోవ్‌ను వెంటనే ఓ ఆస్పత్రికి తరలించి శస్తచ్రికిత్స చేశారు. వీల్‌చైర్‌లో కూర్చోబెట్టి ఇతడిని గురువారం నాడు ఫెడరల్ కోర్టులో హాజరు పరిచారు. న్యూజెర్సీలో ఉంటున్న సైపోవ్ ఐసిస్‌కు గట్టి మద్దతుదారు అని అమెరికన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఎఫ్‌బిఐ పేర్కొంది. తాను ఉంటున్న ఆస్పత్రి గదిలో ఐసిస్ పతాకం ఎగరవేయాలని ఇతను కోరాడని, ట్రక్‌తో దాడి చేయడం తనకెంతో సంతోషం కలిగించిందని అన్నట్లు అధికారులు తెలిపారు. ఐసిస్ వీడియోలను చూసి తాను స్ఫూర్తి పొందానని, ఆ సంస్థ నాయకుడు అబూ బకర్ అల్ బాగ్దాదిని వీడియోలో చూడడం ఆనందం కలిగించిందని సైపోవ్ విచారణ అధికారులతో చెప్పాడు. ఇతని అధీనంలో నుంచి రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక సెల్‌ఫోన్‌లో ఐసిస్ ప్రచారానికి సంబంధించి సుమారు 90 వీడియోలు, దాదాపు 3,800 ఫొటోలున్నట్టు కనుగొన్నారు. రెండో సెల్‌ఫోన్‌లో ఇంటర్నెట్‌లో శోధనకు సంబంధించిన సమాచారాన్ని గుర్తించారు. అద్దెకు లభించే ట్రక్ కోసం న్యూయార్క్‌లో ఈనెల 18న ఇతను ఆరా తీసినట్లు పోలీసులకు సమాచారం లభించింది.

చిత్రం..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్