అంతర్జాతీయం

చర్చల ప్రసక్తే లేదు: ఉత్తర కొరియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, నవంబర్ 4: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసియా పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఉత్తర కొరియా తన స్వరం మరింతగా పెంచింది. అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని, అణుదాడులను తాము తీవ్రతరం చేస్తామని ఉత్తర కొరియా హెచ్చరించింది. అణుదాడులు, క్షిపణి దాడులకు ఉత్తర కొరియా సన్నద్ధం అవుతోందన్న భయాందోళనలు పలు దేశాల్లో నెలకొన్న సమయంలో ట్రంప్ తొలిసారి ఆసియా పర్యటనకు శుక్రవారం బయలుదేరి వెళ్లారు. జపాన్‌ను సందర్శించిన అనంతరం ఆయన దక్షిణ కొరియాలో పర్యటించాల్సి ఉంది. దక్షిణ కొరియా జాతీయ అసెంబ్లీలో ట్రంప్ ప్రసంగిస్తారని, ‘దాడుల’కు వ్యతిరేకంగా ఐక్య పోరాటం చేయాలని పిలుపునిస్తారని అమెరికా అధ్యక్ష భవనం ‘వైట్‌హౌస్’ ప్రకటించింది. అయితే, ట్రంప్ తన మాటల్లో ‘తీవ్రత’ను తగ్గించకుంటే ఆయన పర్యటన వల్ల పరిణామాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన దక్షిణ కొరియా ప్రజల్లో వ్యక్తమవుతోంది.
అమెరికా అధినేత ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ల మధ్య ఇటీవలి కాలంలో మాటల యుద్ధం పెరగడంతో వాతావరణం రానురానూ వేడెక్కుతోంది. దూకుడు తగ్గించుకోని ట్రంప్ వల్ల ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న కలవరం కొరియా వాసుల్లో నెలకొందని ఉత్తర కొరియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ యాంగ్ మూ-జిన్ వ్యాఖ్యానించారు. కాగా, ఉభయ కొరియా దేశాలను యుద్ధం అంచుల్లోకి ట్రంప్ నెడుతున్నారని ఆరోపిస్తూ సియోల్‌లో శుక్రవారం నాడు సుమారు 500 మంది నిరసనకారులు రోడ్డెక్కారు. ‘ట్రంప్ వద్దు.. యుద్ధం వద్దు..’ అంటూ వీరు నినాదాలు చేశారు. జర్మనీ నియంత హిట్లర్ దుస్తులను ధరించి ట్రంప్‌లా ఓ నిరసనకారుడు ఆందోళనలో పాల్గొన్నాడు. కాగా, ఈ ఆందోళనకు సమీపంలోనే సుమారు వంద మంది ట్రంప్ మద్దతుదారులు కూడా ప్రదర్శన జరిపారు. ‘ట్రంప్‌కు స్వాగతం.. ట్రంప్‌ను నమ్ముతాం..’ అంటూ వారు నినాదాలు చేశారు.

చిత్రం..ఆసియా పర్యటనలో భాగంగా పసిఫిక్ కమాండర్ అడ్మిరల్
ఆడం హారీహారిస్‌తో సమావేశమైన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్