అంతర్జాతీయం

సిరియాలో ఐసిస్ దాడి: 75 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీరూట్, నవంబర్ 5: ‘ఇస్లామిక్ స్టేట్’ ఉగ్రవాద సంస్థ సిరియాలో జరిపిన కారుబాంబు దాడిలో కనీసం 75 మరణించారు. ఈశాన్య సిరియాలోని డీర్ ఎజొర్ ప్రాంతంలో జనంతో రద్దీగా ఉన్న ప్రాంతంలో శనివారం జరిగిన ఈ ఘటనలో పిల్లలు సహా 75 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు జరిపిన ఈ విధ్వంసకాండలో సుమారు 140 మంది గాయపడ్డారని సిరియాలో మానవ హక్కుల పర్యవేక్షణ సంస్థ అధిపతి రమీ అబ్దెల్ రెహ్మాన్ తెలిపారు. సిరియాలో ఉగ్రదాడులు నిత్యకృత్యం కావడంతో డీర్ ఎజొర్ ప్రావిన్స్‌కు చెందిన వేలాది మంది పౌరులు దుర్భర జీవనం గడుపుతున్నారు. కొందరైతే శరణార్థులుగా ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. సిరియా ప్రజాస్వామ్య దళాల (ఎస్‌డిఎఫ్) అధీనంలో ఉన్న ప్రాంతంలోనే శనివారం ఐసిస్ ఉద్రవాదులు కారుబాంబును పేల్చారు. ఈ ప్రాంతంలోనే శరణార్థులు అధిక సంఖ్యలో తలదాచుకుంటున్నారు. డీర్ ఎజొర్‌లోని పౌరులపై ఐసిస్ దాడి జరపడం ఇదే ప్రథమం కాదు. గత నెల 12న జరిగిన కారుబాంబు దాడిలో 18 మంది మరణించారు. మృతుల్లో పౌరులతో పాటు ఖుర్దిష్ భద్రతా దళానికి చెందిన వారు కూడా ఉన్నారు. ఐసిస్ దాడుల కారణంగా లక్షలాది మంది పౌరులు ముఖ్యంగా చిన్నారులు భయంతో గడుపుతున్నారని సిరియాలోని ‘సేవ్ ది చిల్డ్రన్’ సంస్థ డైరెక్టర్ సోనియా ఖుష్ ఆందోళన వ్యక్తం చేశారు.