అంతర్జాతీయం

రెచ్చగొడితే మనకే ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 5: ఉత్తర కొరియా దూకుడుకు అడ్డుకట్ట వేసి జీవ, రసాయిన ఆయుధాలను ప్రయోగించకుండా చేయాలంటే ముందుస్తుగా పదాతి దళాలతో దాడులు జరపడం ఒక్కటే మార్గమని అమెరికా భావిస్తోంది. ప్రస్తుత ఉద్రిక్తతలు తీవ్రమయ్యే పక్షంలో అత్యంత ప్రమాదకరమైన జీవ, రసాయిన ఆయుధాలను ప్రయోగించేందుకు ఉత్తర కొరియా ఒడిగట్టే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయంటూ పెంటగాన్ హెచ్చరించింది. ఇలాంటి అవకాశం ఆ దేశానికి లేకుండా చేయాలంటే సైనిక దళాలతో దాడులు జరిపి ఆ దేశ అణ్వాయుధ స్థలాలను నిర్వీర్యం చేయడం ఒక్కటే మార్గమని తెలిపింది. ఈమేరకు కాంగ్రెస్ సభ్యులకు ఓ లేఖ రాసింది. ఉత్తర కొరియాను దారికి తేవడంతోపాటు దాని అణు సామర్థ్యాన్ని కూడా నిర్వీర్యం చేయగలిగితేనే తదుపరి ప్రమాదాలకు ఆస్కారం ఉండదని, ఇందుకు అమెరికా తన శక్తియుక్తులను పూర్తిస్థాయిలో వినియోగించాల్సిన అవసరం ఉందని ఆ నివేదికలో తెలిపింది. ఇందుకు సంబంధించి ఏవిధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై కాంగ్రెస్‌లో సమగ్ర చర్చ జరగాలని, అనంతరమే పదాతి దళాలతో దాడులు జరిపి ఉత్తర కొరియా అణుస్థావరాలను నిర్మూలించాలని తెలిపింది. ఉత్తర కొరియా దీర్ఘకాలంగా రసాయిన ఆయుధాల కార్యక్రమాన్ని కొనసాగిస్తోందని, దీనిద్వారా నెర్వ్ గ్యాస్‌తోపాటు రక్తప్రసారాన్ని నిలిపివేసే వాయువులను కూడా సృష్టించే అవకాశం ఉంటుందని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో ఈరకమైన ప్రమాదకర చర్యలకు ఉత్తర కొరియా ఒడిగట్టే అవకాశం ఉందన్న వాస్తవాన్ని విస్మరించే అవకాశం లేదని పెంటగాన్ తెలిపింది. ఒకవేళ ఉత్తర కొరియాతో యుద్ధం జరిగితే ప్రాణ నష్టం ఏమేరకు జరగొచ్చన్న అంశంపై పెంటగాన్ స్పందించింది. అయితే, ఇందుకు సంబంధించి రాబోయే పరిణామాలను పూర్తిగా ఊహించలేమని, లాభనాష్టాల బేరీజు అన్నది అనేక అంశాలతో ముడిపడి ఉంటుందని పేర్కొంది. ఉత్తర కొరియా ఏరకమైన దాడులకు ఒడిగడుతుంది, వాటి స్వభావం ఏమిటి అనే దానిపైనే అమెరికాకు ఎదురయ్యే పరిస్థితులు ఆధారపడతాయని తెలిపింది. అలాగే, ఉత్తర కొరియా ఇందుకు తెగబడితే ఇటు శతఘు్నలతోను, రాకెట్లతోను, క్షిపణులతోను విరుచుకుపడితే అందుకే అమెరికా దక్షిణ కొరియా దళాలు ఏవిధంగా, ఎంత త్వరతగతిన స్పందిస్తాయన్నది కూడా అనంతర పరిణామాలకు ఆస్కారం ఇస్తాయని తెలిపింది. ఈనేపథ్యంలో 16మంది అమెరికా కాంగ్రెస్ సభ్యులు ‘ఉత్తర కొరియాను రెచ్చగొట్టకండి’ అంటూ అధ్యక్షుడు ట్రంప్‌కు విజ్ఞప్తి చేస్తూ ఓ లేఖ రాశారు. దానితోపాటే పెంటగాన్ తాజా లేఖ కూడా విడుదలైంది. ఉత్తర కొరియాను అనవసరం రెచ్చగొట్టడం మాని, దౌత్యపరమైన ప్రయత్నాలతో సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ సభ్యులు సూచించారు. అమెరికా ఎంత రెచ్చగొడితే అంతగానూ అణు కార్యక్రమంపై ఉత్తర కొరియా దృష్టిపెట్టే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.