అంతర్జాతీయం

వివాదాస్పద ప్రాంతానికి ఎందుకొచ్చారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, నవంబర్ 6: భారత రక్షణమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక నిర్మలా సీతారామన్ తొలిసారి అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించడాన్ని చైనా ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. అరుణాచల్‌లోని ఆంజ్యా జిల్లా కుబుతు సైనిక స్థావరాన్ని ఆమె ఆదివారం సందర్శించిన సంగతి తెలిసిందే. తమ దేశ సరిహద్దు వెంబడి ఉన్న ఈ సైనిక స్థావరానికి భారత రక్షణమంత్రి వెళ్లడాన్ని చైనా తట్టుకోలేకపోయింది. వివాదాస్పద ప్రాంతంలో ఇలా పర్యటనలు జరపడం వల్ల అక్కడ శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హూ చునియింగ్ సోమవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అన్నారు. ఇలాంటి పర్యటనలు జరిపే ముందు తమ దేశం ఎలా భావిస్తుందో తెలుసుకోవాలని చునియింగ్ వ్యాఖ్యానించారు. సరిహద్దు వివాదాలు ఉన్నపుడు చర్చల ద్వారా మాత్రమే వాటిని పరిష్కరించుకోవాలే తప్ప, ఇలాంటి పర్యటనలు జరపడం వల్ల పరిస్థితి మరింత సంక్లిష్టమవుతుందన్నారు. ఉభయ దేశాలకూ ఆమోదకరమైన రీతిలో భారత్ ఆలోచించాలని ఆమె సలహా ఇచ్చారు. భారత, చైనాల మధ్య గత కొనే్నళ్లుగా వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అరుణాచల్ టిబెట్‌లో అంతర్భాగమేనని వాదిస్తున్న చైనా- ఆ ప్రాంతంలో భారత ఉన్నతాధికారులు, నేతలు పర్యటించినపుడల్లా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. తాజాగా రక్షణమంత్రి సీతారామన్ అరుణాచల్‌లోని సైనిక స్థావరాన్ని సందర్శించడంపై కూడా ఆ దేశం అభ్యంతరం తెలిపింది. ‘అరుణాచల్‌లో భారత రక్షణమంత్రి పర్యటన అంటే.. అక్కడ చైనా స్థానమేంటో తెలుసుకోవాలి.. వివాదాన్ని పరిష్కరించుకునేందుకు భారత్ తమతో కలసి పనిచేయాలి’ అని చైనా తన స్వరం పెంచుతోంది.

చిత్రం..అరుణాచల్‌ప్రదేశ్‌లోని కిబుతు సైనిక స్థావరంలో ఆర్మీ అధికారులు, జవాన్ల
సాధక బాధకాలు తెలుసుకుంటున్న రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్