అంతర్జాతీయం

కాబూల్‌లో టీవీ చానల్‌పై ఉగ్రదాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్, నవంబర్ 7: అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని ‘శంషాద్’ టీవీ చానల్ కార్యాలయంలోకి మంగళవారం ఉదయం కొందరు ఉగ్రవాదులు ప్రవేశించి కాల్పులకు పాల్పడ్డారు. దీంతో కొందరు సిబ్బంది భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. అయితే, ఇంకా చాలామంది ఉద్యోగులు భవనంలోనే బందీలుగా ఉన్నారని తెలుస్తోంది. శంషాద్ టీవీ ఛానల్ ఉన్న భవనంలోకి కొందరు దుండగులు ప్రవేశించి తుపాకుల మోతతో బీభత్సం సృష్టించారని, భవనంలో ఇంకా సుమారు వందమంది బిక్కుబిక్కుమంటూ ఉన్నారని ఛానల్ ఉద్యోగి ఒకరు తెలిపారు. ముగ్గురు దుండగులు ప్రవేశించి తొలుత సెక్యూరిటీ గార్డుపై దాడి చేశారని, ఆ తర్వాత వారు గ్రనేడ్లు విసురుతూ విచక్షణారహితంగా కాల్పులు జరిపారని దాడి నుంచి బయటపడిన టీవీ విలేఖరి ఫైజల్ జలాండ్ వివరించాడు. కాల్పులు జరుగుతుండగా తాను భవనం వెనుక మార్గం నుంచి తప్పించుకున్నానని అతను తెలిపాడు. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా సిబ్బంది చానల్ భవనాన్ని చుట్టుముట్టారు. దుండగులను పట్టుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. చాలామంది ఉద్యోగులు భవనంలోనే ఉన్నందున వారిని దుండగుల బారి నుంచి కాపాడేందుకు భద్రతాసిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ దాడితో తమకు సంబంధం లేదని తాలిబన్ సంస్థ అధికార ప్రతినిధి జబీల్లా ముజాహిద్ ‘ట్విట్టర్’లో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆరా తీస్తున్నామని, వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అఫ్గాన్ అంతరంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. తాలిబన్, ఐసిస్ ఉగ్రవాద సంస్థల కార్యకర్తలు ఇటీవలి కాలంలో కాబూల్‌లో పలుసార్లు ఘాతుక చర్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. గత మంగళవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో ఆరుగురు వ్యక్తులు మరణించగా, పెద్ద సంఖ్యలో స్థానికులు గాయపడ్డారు. గత మే 31న ట్రక్ బాంబు పేలిన ఘటనలో దాదాపు 150 మంది మరణించడంతో కాబూల్‌లో భద్రతను పెంచారు. అయినప్పటికీ ఉగ్రవాదుల దుశ్చర్యలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.
ఈ నెల ఆరంభంలో కాబూల్ పోలీసులు 2,700 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. టమాటాల కింద పెట్టి పేలుడు పదార్థాలను తరలిస్తున్నట్లు వారు గుర్తించారు.

చిత్రం..ఉగ్రవాదులు నక్కిన టీవీ కార్యాలయం వెలుపల వేచివున్న పత్రికా ఫొటోగ్రాఫర్లు