అంతర్జాతీయం

అదో నరకకూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, నవంబర్ 8: ఉత్తర కొరియా ప్రజలు అత్యంత క్రూరమైన నియంతృత్వ పాలనలో మనుగడ సాగిస్తున్నారని, రాజకీయంగా తీవ్ర స్థాయిలో అణచివేతకు గురవుతున్నారని బుధవారం నాడిక్కడ దక్షిణ కొరియా పార్లమెంటును ఉద్దేశించి చేసిన ప్రసంగంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిప్పులు చెరిగారు. ఉత్తర కొరియా ప్రజలకు సమానత్వ హక్కులు లేవని, అత్యంత హేయమైన పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారని అన్నారు. గత్యంతరం లేక కిమ్ జోంగ్ నియంత్వానికి కట్టుబానిసలైపోయారని ట్రంప్ విరుచుకుపడ్డారు. ఎవరైతే ఈ నియంతృత్వ పాలనకు విధేయంగా ఉంటారో వారే మనుగడ సాగించే పరిస్థితి ఉత్తర కొరియాలో ఉందన్నారు. దేశ రాజధాని నగరంలో నివసిస్తున్న వారందరూ కూడా ఈ నియంతృత్వానికి విధేయులైనవారేనని, మిగతావారందరి జీవితాలూ అత్యంత భయానక రీతిలోనే ఉన్నారని ట్రంప్ అన్నారు. గత 24 సంవత్సరాలుగా దక్షిణ కొరియా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించిన తొలి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కొరియా ద్వీపకల్పంలో దక్షిణ కొరియాలో స్వేచ్ఛాయుత జీవన పరిస్థితులుంటే ఉత్తర కొరియాలో భయానక రీతిలో నియంతృత్వ పాలన, అణచివేత సాగుతోందన్నారు. కిమ్ జోంగ్ ప్రభుత్వం ఉత్తర కొరియాపై ఉక్కుపాదం మోపిందని, స్వేచ్ఛాయుత జీవనానికి ఆస్కారం లేని అణచివేత పరిస్థితులను కల్పించిందని ట్రంప్ అన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఉత్తర కొరియాలో మానవ హక్కుల ఉల్లంఘనలు, అత్యాచారాలు తీవ్రస్థాయిలో సాగుతున్నాయంటూ ఆందోళనలు వ్యక్తమైన విషయాన్ని ట్రంప్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశాన్ని వదిలి పారిపోవాలనుకునేవారికి ప్రత్యక్ష నరకాన్ని చూపించిన సందర్భాలు కూడా ఉత్తర కొరియాలో ఎన్నో ఉన్నాయని ట్రంప్ అన్నారు. ఉత్తర కొరియా అంతటా జైలు శిబిరాలున్నాయని, అవన్నీ నరక కూపాలేనని, చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా అక్కడి ఖైదీలు దారుణ వేధింపులకు గురవుతున్నారని ట్రంప్ అన్నారు.