అంతర్జాతీయం

జడత్వం వీడితేనే దృఢత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, నవంబర్ 8: వర్తమాన ప్రపంచ అవసరాలను గుర్తించి సమస్యలను పారదర్శక రీతిలో పరిష్కరించే దిశగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని సంస్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత్ డిమాండ్ చేసింది. ఈ పారదర్శకత సంస్కరణ ప్రక్రియపై ఇంతవరకు ఎలాంటి చర్చ జరక్కపోవడం విచారకరమని ఐరాసలో భారత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ అన్నారు. ఈ ఏడాది కాలంలో ఈ సంస్కరణల ప్రక్రియపై ఎందుకు చర్చ జరగలేదన్న దానిపై విశే్లషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ సంస్కరణలకు కీలకంగా భావించే ఏ ఒక్క అంశంపైనా ఐరాస సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని, అందుకు కారణం ఏమిటో నిగ్గుదేలాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఐరాస జనరల్ అసెంబ్లీ ప్లీనరీ సమావేశాలను ఉద్దేశించి మాట్లాడిన అక్బరుద్దీన్ ఐరాసలో వ్యవస్థీకృత జడత్వానికి ఇంతకుమించిన ఉదాహరణ మరొకటి లేదని, దీని కారణంగానే నిర్మాణాత్మక చర్చలు జరగడం లేదని అన్నారు. ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్న కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సమష్టి కృషి అవసరమని, వీటి విషయంలో కేవలం ప్రభుత్వాలపైనే బాధ్యతలు వదిలివేయడం కాకుండా అన్ని దేశాలు ఉమ్మడి స్ఫూర్తితో కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన దౌత్యప్రక్రియల్లో సామాజిక ప్రమేయాన్ని క్రియాశీలక రీతిలో పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అసలీ సంస్కరణల ప్రక్రియపై చర్చలు ఎందుకు ఆగాయో తెలుసుకోవాలంటే ఏదో ఒక అడుగు ముందుకు పడాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు. ప్రస్తుతం ఉన్న ఐక్యరాజ్య సమితి ఎంతమాత్రం వర్తమాన వాస్తవాలకు అద్దం పట్టడం లేదని, అందుకే దీని చెల్లుబాటు, ప్రతిష్ట కూడా ప్రశ్నార్థకంగా మారుతున్నాయని అన్నారు.