అంతర్జాతీయం

మోదీ గ్రేట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డానాంగ్ (వియత్నాం), నవంబర్ 10: భారత దేశ ఆర్థిక వ్యవస్థ ద్వారాలు తెరుచుకున్న తరువాత అసాధారణమైన, అద్భుతమైన ప్రగతిని సాధించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఇక్కడ ప్రశంసల వర్షం కురిపించారు. అత్యంత విశాలమైన దేశాన్ని ప్రజానీకాన్ని ప్రధాని మోదీ విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారని ట్రంప్ అన్నారు. ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార మండలి (ఏపీఇసీ) వార్షిక శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్‌‘ఈ కూటమి వెలుపల ఉన్న దేశాలు ఆర్థికంగా కొత్త పుంతలు తొక్కుతున్నాయి’అని అన్నారు. భారత దేశం 70వ స్వాతంత్య్ర దినోత్సవ వార్షికోత్సవాలను జరుపుకుంటుందని పేర్కొన్న ట్రంప్ ‘130 కోట్ల జనాభా కలిగిన సువిశాల సార్వభౌమత్యం ప్రజాసామ్యదేశం భారత్. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కూడా’అని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ ద్వారాలు తెరుచుకున్నప్పటి నుంచి వృద్ధి రేటు అత్యంత వేగంగా పెరుగుతూ వచ్చిందని అలాగే ఈ దేశ మధ్యతరగతి ప్రజలకు అనంతమైన అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు అన్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇటు సువిశాల దేశాన్ని, భిన్న భాషలు, మతాలు, సంస్కృతులు కలిగిన ప్రజా బాహుళ్యాన్ని ఒక్కతాటిపై ముందుకు నడుపుతున్నారని చెప్పారు. ఈ విషయంలో ఇప్పటి వరకూ ఆయన ప్రయత్నాలన్నీ విజయవంతమయ్యాయని ట్రంప్ స్పష్టం చేశారు. భారత ప్రధాని మోదీ తూర్పు ఆసియా, భారత్ ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఆదివారం ఫిలిప్పీన్స్ వెళ్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం, ఆయన నాయకత్వాన్ని కొనియాడడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సదస్సులో ట్రంప్ ప్రసంగంలో ఇండో-పసిఫిక్ ప్రాంతం అన్న మాట రావడం మరింతగా చర్చనీయాంశమైంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని దేశాలతో అమెరికాకు చాలా లోతైన సంబంధాలున్నాయని ఈ ప్రాంతం ఇటీవల కాలంలో ఎన్నో విజయాలు నమోదు చేసుకుందని అన్నారు. ప్రజలే తమ భవితవ్యాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎలాంటి ప్రగతి సాధ్యమవుతుందో ఈ ప్రాంతంలోని దేశాలు రుజువుచేశాయని అన్నారు. ట్రంప్ నోట ఇండో-పసిఫిక్ అన్న మాట రావడాన్ని బట్టిచూస్తే అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్‌లతో కలిసి వ్యూహాత్మక భాగస్వామ్య బంధం ఏర్పడే అవకాశం ఉందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఈ ప్రతిపాదన విషయంలో చైనా తీవ్ర స్థాయిలోనే ప్రతిస్పందించింది. ‘ఈ నాలుగు దేశాలు ఏ విధంగా జతకట్టినా కూడా అధి మరోదేశ ప్రయోజనాలకు ప్రతికూలం కాకూడదు’ అని చైనా పేర్కొంది. గత దశాబ్దకాలంగా అనూహ్యరీతిలో ఆర్థికంగా ఎదుగుతున్న చైనాను అడ్డుకునే లక్ష్యంతోనే ఇండో-పసిఫిక్ కూటమి ఏర్పాటుపై అమెరికా దృష్టి పెట్టిందన్న కథనాలు వెలువడుతున్నాయి. ఇండోనేసియా, థాయ్‌లాండ్, ఫిలప్పీన్స్, మలేసియా వంటి దేశాల ప్రగతిని కూడా ప్రశంసించిన ట్రంప్ ‘మనం ఇక శత్రువులం కాదు.. మంచి మిత్రులమే’ అని చెప్పారు. అమెరికా, వియత్నాం మధ్య జరిగిన యుద్ధంలో డానాంగ్ ప్రాంతంలో రణ క్షేత్రం అయిందన్న విషయం ఈ సందర్భంగా గమనార్హం.