అంతర్జాతీయం

వైభవంగా బ్రిటిష్ రాణి జన్మదిన వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 11: బ్రిటిష్ రాణి రెండవ ఎలిజబెత్ 90వ అధికారిక పుట్టిన రోజు వేడుకలు శనివారం కన్నుల పండువగా జరిగాయి. సెంట్రల్ లండన్‌లో జరిగిన కలర్ పరేడ్ ఈ వేడుకలకు హైలైట్‌గా నిలిచింది. 1600పైగా సైనికులు, 300 గుర్రాలు హార్స్ గార్డ్స్ పరేడ్‌లో పాలుపంచున్నాయి. రాణి ఎలిజబెత్, ఇతర కుటుంబ సభ్యులు బకింగ్‌హామ్ ప్యాలెస్ బాల్కనీపైనుంచి రాయల్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానాలు నిర్వహించిన ఫ్లైపాస్ట్‌ను తిలకించారు. థేమ్స్ నదిలో జరిగిన పడవల ప్రదర్శనలో పలు పురాతన పడవలు సైతం పాలుపంచుకున్నాయి. బ్రిటన్‌లోని అనేక నగరాల్లో సైతం ఈ వేడుకలు జరిగాయి. పరేడ్‌ను తిలకించడానికి ముదురు లైమ్ గ్రీన్ కోట్, పూలతో అలంకరించిన అదేరంగు టోపీ ధరించిన రాణి గుర్రపు బగ్గీలో బకింగ్‌హామ్ ప్యాలెస్‌నుంచి యువరాజు (డ్యూక్ ఆఫ్ ఎడింబరో) ఫిలిప్‌తో కలిసి బయలుదేరినప్పుడు మార్గానికి ఇరువైపులా పెద్ద సంఖ్యలో జనానికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రాణి అధికారిక పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడానికి దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో శుక్రవారంనుంచి ఆదివారం దాకా మూడు రోజులపాటు రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాణి ప్రతి ఏటా రెండుసార్లు పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంటారు. ఆమె అసలు పుట్టిన రోజయిన ఏప్రిల్ 21న ఒకసారి, జూన్ నెలలో ఒక శనివారం మరోసారి అధికారిక పుట్టినరోజు జరుపుకొంటారు.