అంతర్జాతీయం

హిందూ మహాసముద్రంలో అమెరికాతో కలిసి గస్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 10: ముంచుకొస్తున్న భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ హిందూ మహాసముద్రంలో పొరుగు దేశాల ఆర్మీలకు సూచనలు ఇచ్చేందుకు అగ్రస్థావరాలను (్ఫర్వర్డ్ పోస్టులను) ఏర్పాటు చేయాలని, ప్రత్యేక బలగాలను తయారు చేయాలని, అమెరికాతో కలిసి సంయుక్తంగా సముద్రంలో గస్తీని మరింత పెంపొందించుకోవాలని అమెరికాకు చెందిన ఒక సంస్థ సూచించింది. భారత్, చైనాల మధ్య డోక్లాం ప్రతిష్టంభన నెలకొన్న తరువాత వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న అట్లాంటిక్ కౌన్సిల్‌కు చెందిన ‘ద సౌత్ ఆసియా సెంటర్’ ఈ సూచన చేసింది.
భారత్ క్రమం తప్పకుండా భారత్-అమెరికా-చైనాల మధ్య చర్చలు జరగాలనే ప్రతిపాదన చేయాలని ‘్భరత్-చైనా తగాదా, ఇండో-పసిఫిక్‌లో కొత్త భౌగోళిక రాజకీయాలు’ అనే శీర్షికతో రూపొందించిన తన నివేదికలో సూచించింది. భారత్-చైనాల మధ్య అపార్థాలు, తప్పుడు అంచనాలు తలెత్తకుండా ఉండటానికి కనీసం ఏడాదికి ఒకసారయినా ఈ చర్చలు జరగాలని, జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా కాని, తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా కాని ఈ చర్చలు జరగాలని సూచించింది. భారత్, చైనాల మధ్య గట్టి ఆర్థిక సంబంధాలు, ఉభయ ప్రయోజనాలు ఉన్నాయని, ప్రత్యేకించి బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) సంస్థల్లో, జీ-20 దేశాలలో ఈ రెండూ సభ్యదేశాలుగా ఉన్నాయని, అయినప్పటికీ ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు వివాదాలు చైనా ఉద్దేశాల పట్ల భారత్ సంశయాలను పెంచుతున్నాయని భరత్‌గోపాల స్వామి, రాబర్ట్ ఎ మానింగ్ రూపొందించిన ఈ నివేదికలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి, మార్కెట్ ఆర్థిక వ్యవస్థకు కట్టుబడిన దేశంగా భారత్ చైనాకన్నా ఎక్కువ ప్రపంచ క్రమం ఆధారిత నియమాలపై కేంద్రీకరించాలని నివేదిక సూచించింది. భారత్, అమెరికాలు సంయుక్త సముద్ర గస్తీలను విస్తరించాలని సిఫారసు చేసింది.
ముఖ్యంగా చైనా విస్తరిస్తున్న అంతర్జాతీయ సముద్ర జలాల్లో భారత్, అమెరికాలు తమ ఉనికిని చాటాలని సూచించింది. దీనివల్ల హిందూ మహాసముద్రంలో భారత్, చైనాలు కలిసి చైనా మిలిటరీని నిలువరించగలుగుతాయని పేర్కొంది.