అంతర్జాతీయం

ఐసీజే పదవికి దల్వీర్ భండారీ గట్టిపోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్యసమితి, నవంబర్ 10: అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లోని న్యాయమూర్తి పదవి కోసం భారత్‌కు చెందిన దల్వీర్ భండారీ, బ్రిటన్‌కు చెందిన క్రిస్ట్ఫోర్ గ్రీన్‌వుడ్‌ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఈ ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలన్న విషయమై ఐక్యరాజ్యసమితి ఎటూ తేల్చుకోలేక పోవడంతో సోమవారం మరోసారి పోలీంగ్‌ను చేపట్టనున్నారు. ఇప్పటికే ఈ పదవి కోసం ఎన్నిక నిర్వహించినా, భండారీ, క్రిస్ట్ఫోర్‌లు సమానంగా నిలవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయ న్యాయస్థానంలో ఖాళీగా ఉన్న అయిదు పదవులకు ఎన్నికలు నిర్వహించగా ఆరుగురు పోటీ పడ్డారు. నలుగురు న్యాయమూర్తుల ఎన్నిక సజావుగా జరిగినా, ఒక పదవి విషయంలో మాత్రం ప్రతిష్టంభన ఏర్పడింది. ఐరాసలోని జనరల్ అసెంబ్లీలోని 193 మంది సభ్యులు, భద్రతామండలిలోని 15 మంది సభ్యులు అంతర్జాతీయ న్యాయస్థానంలోని జడ్జీలను ఎన్నుకుంటారు. సోమవారం జరిగే ఓటింగ్ వీరంతా భండారీ (70), క్రిస్ట్ఫోర్ (62)ల భవితవ్యాన్ని తేల్చనున్నారు. నెదర్లాండ్స్‌లోని ‘ది హేగ్’లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానంలో మొత్తం 15 మంది న్యాయమూర్తులుంటారు. వీరి పదవీకాలం తొమ్మిదేళ్లు. అయితే, ప్రతి మూడేళ్లకోసారి ప్రతి అయిదుగురి స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. భారత్‌కు చెందిన జస్టిస్ భండారీ, బ్రిటన్‌కు చెందిన క్రిస్ట్ఫోర్ పదవీ కాలం ముగియడంతో వారు మళ్లీ గెలిచేందుకు పోటీ పడుతున్నారు. నాలుగు స్థానాలకు ఫ్రాన్స్, లెబనాన్, సోమాలియా, బ్రెజిల్‌కు చెందిన వారు మెజారిటీ ఓట్లను సాధించి విజేతలుగా నిలిచారు. అయిదో స్థానానికి మాత్రం భండారీ, క్రిస్ట్ఫోర్ పోటీ పడినా ఇద్దరికీ సమానంగా ఓట్లు రావడంతో సోమవారం తిరిగి పోలింగ్ జరిపేందుకు ఐరాస ఏర్పాట్లు చేసింది.