అంతర్జాతీయం

ప్రపంచ మార్కెట్‌లో దేశీయ కాఫీ మార్కెట్ కుదేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 11: ప్రపంచ మార్కెట్‌లో దేశీయ కాఫీ మార్కెట్ ఒక్కసారిగా కుదేలైంది. బ్రెజిల్, వియత్నాం, ఇండోనేసియా, కొలంబియా వంటి దేశాలు కాఫీ మార్కెట్‌ను శాసిస్తున్నాయి. గత కొంతకాలంగా ఈ దేశాల్లో కాఫీ పంట ఎక్కువగా దిగుబడి కావడం, వ్యాపారం ఆశించిన స్థాయిలో జరగడంతో మన దేశం నుంచి ఎగుమతి అయ్యే కాఫీకి డిమాండ్ లేకుండా పోయింది. దీంతో మన కాఫీ గురించి ఆయా దేశాలు పట్టించుకోవడంలేదు. కాఫీ ఎగుమతులు సైతం గణనీయంగా పడిపోయాయి. ఎపుడూ లేని విధంగా దేశీయ కాఫీకి ఆదరణ తగ్గడంతో ఆన్‌లైన్ వేలం (ఆక్షన్) పాటకు స్పందన కరవవుతోంది. భారతదేశంలో ఒక్క కర్ణాటకలో మాత్రమే దీనిని సాంప్రదాయ పంటగా నిర్వహిస్తున్నారు.
దీని తరువాత తమిళనాడు, కేరళ, ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో కొంతమేర కాఫీని పండిస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ ఏజెన్సీ అరకు, పాడేరు, చింతపల్లి, గూడెం కొత్తవీధి, అనంతగిరి తదితర ప్రాంతాల్లో వేలాది హెక్టార్టల్లో కాఫీ పంట పండుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న గిరిజన సహకార సంస్థ (జిసిసి) గిరిజన రైతులకు లబ్ధి చేకూర్చాలనే సంకల్పంతో, నిరుద్యోగ గిరిజన యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో గత ఏడాది అక్టోబర్‌లో ‘కాఫీ ప్రాజెక్టు’ను చేపట్టింది. పదేళ్ళపాటు ఐటిడిఏ, జిసిసి సంయుక్త ఆధ్వర్యంలో దీనిని నిర్వహించేందుకు పాడేరు డివిజన్ పరిధిలో పది గిరిజన మండలాలకు సంబంధించిన 20వేల మంది గిరిజన రైతులను ఈ ప్రాజెక్టులో సభ్యులుగా చేర్చుకునే కార్యక్రమం పూర్తయ్యింది.
ఈ విధంగా తొలి ఆరు మాసాల్లోనే లక్ష్యాలను సాధించగలిగిన జిసిసి గిరిజన రైతుల నుంచి రెండు వేల టన్నుల కాఫీ ముడి సరుకును సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, 1300 టన్నుల కాఫీ గింజలను కొనుగోలు చేయగలిగింది. ఇందులో 700 టన్నుల కాఫీ గింజలను ప్రాసెసింగ్ చేయగా, దాదాపు 400 టన్నుల మేర క్లీన్ కాఫీని సిద్ధం చేయగలిగింది. దీనిని ఆన్‌లైన్ వేలం ద్వారా ఎగుమతిదారులకు విక్రయించగా దాదాపు రూ.4.5 కోట్ల మేర ఆదాయాన్ని సంపాదించింది. తొలి దశలోనే కర్ణాటక నుంచి 13 మంది ఎగుమతిదారులు ఆంధ్రాలో అరకు కాఫీ గింజల కొనుగోలుకు ముందుకు వచ్చారు. గత రెండు మాసాలుగా ప్రపంచ మార్కెట్‌లో దేశీయ కాఫీకి అంతగా ఆదరణ లభించకపోవడంతో ఆంధ్రా కాఫీ ఎగుమతులు నిలిచిపోతున్నాయి. అంతర్జాతీయ కాఫీ మార్కెట్‌కు కేంద్రం న్యూయార్క్ కావడంతో అక్కడే దీని విక్రయ ధరను నిర్దేశించడం, భారతదేశంలో ఎక్కడా కాఫీ మార్కెట్ లేకపోవడం, ప్రపంచ దేశాలకు దీనిని ఎగుమతి చేయడం ఒక్కటే మార్గమవుతోంది.
అయితే ప్రపంచ కాఫీ మార్కెట్‌లో రూపాయి మారకం విలువ పడిపోవడం, కాఫీ అత్యధికంగా పండించే దేశాలు దీని మార్కెట్‌ను శాసిస్తున్న పరిస్థితులూ దేశీయ కాఫీకి ఆదరణ లేకుండా చేస్తున్నాయి. న్యూయార్క్ నిర్దేశించిన ధర ప్రకారం దేశీయ కాఫీకి సంబంధించి కిలో రూ.170 ఉండగా, ఇది కాస్త రూ.120లకు పడిపోయింది. అలాగే టన్ను కాఫీ గింజలు 12 వేల వరకు ఉండగా, ఇది కూడా గణనీయంగా తగ్గిపోవడంతో కర్ణాటకకు చెందిన ఎగుమతిదారులు సైతం దీని కొనుగోలుకు ముందుకు రావడంలేదు. ఇదే జిసిసికి ఆందోళన కలిగిస్తోంది. గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ఆన్‌లైన్ వేలానికి సైతం దేశంలో ఏ రాష్ట్రం నుంచి ఎగుమతిదారులు ముందుకు రావడం లేదు. దీంతో విరివిగా సేకరిస్తున్న కాఫీ గింజలను ఏం చేయాలో తెలియని అయోమయంలో జిసిసి ఉండగా, దీనిపైనే ఆశలు పెట్టుకునే గిరిజన రైతులు సైతం ఆందోళన చెందుతున్నారు.