అంతర్జాతీయం

చైనా దూకుడుకు మోదీ కళ్లెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనీలా, నవంబర్ 14: ‘విస్తరణ కాంక్ష’తో చెలరేగిపోతున్న చైనాకు పగ్గాలు వేయాలని సంకల్పించిన మన ప్రధాని అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి భారత గణతంత్ర వేడుకలకు హాజరు కావాల్సిందిగా ‘ఆసియాన్’ సభ్య దేశాల నేతలను ఆహ్వానించారు. వచ్చే నెల 26న ఢిల్లీలో జరిగే భారత గణతంత్ర దినోత్సవానికి హాజరు కావాలని పది ‘ఆసియాన్’ దేశాధినేతలను ఆయన కోరారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ‘ఆసియాన్’ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మనీలాలో మంగళవారం జరిగిన 15వ ‘ఆసియాన్- ఇండియా సదస్సు’లో మోదీ మాట్లాడుతూ, ఆగ్నేయాసియా దేశాల ప్రయోజనాలు, శాంతియుత అభివృద్ధికి ఉపయోగపడే విధంగా నిబంధనల ఆధారంగా ప్రాంతీయ భద్రతా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు భారత్ అన్ని విధాలా సహాయ సహకారాలను అందజేస్తుందని ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 25న న్యూఢిల్లీలో జరిగే ‘ఇండియా- ఆసియాన్ ప్రత్యేక సదస్సు’లో మరింత పటిష్ట బంధం ఏర్పడాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్ నిర్వహించే 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు వచ్చే ఆసియాన్ దేశాధినేతలకు 125 కోట్ల మంది భారతీయులు నిండుమనసులతో స్వాగతం పలుకుతున్నారని అన్నారు. విశ్వవ్యాప్తంగా ఉగ్రవాదం అంతానికి అన్ని దేశాలూ కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గణతంత్ర దినోత్సవాలకు ఆసియాన్ దేశాధినేతలు
హాజరైతే ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది.