అంతర్జాతీయం

దక్షిణ కొరియాలో భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, నవంబర్ 15: దక్షిణ కొరియాలో తీవ్రమైన భూకంపం సంభవించింది. దేశానికి ఆగ్నేయంగా బలమైన ప్రకంపనలు వచ్చినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. భూకంప తీవ్రత రెక్టార్ స్కేల్‌పై 5.4గా నమోదైంది. పారిశ్రామిక నగరం పోహాంగ్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో భూమి కంపించిందని అన్నారు. రాజధాని సియోల్, దాని పరిసరాల్లో దాని ప్రభావం ఉంది. సియోల్‌లో ఏడుగురు గాయపడ్డారని ప్రభుత్వం వెల్లడించింది. దక్షిణ కొరియాను భూకంపాల భయం వెన్నాడుతూనే ఉంది. దీనికితోడు ఉత్తర కొరియా అణు ప్రయోగాలు ఆ భయాన్ని మరింత పెంచుతున్నాయ. పోహాంగ్ పారిశ్రామిక నగరమే కాదు.. రేవు పట్టణం కూడా. ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచలోనే నాలుగో పెద్ద నగరం. పోస్కోకు రాజధానిగా ఉన్న పోహాంగ్‌కు దగ్గర్లోనే సంభవించిన ఈ భూకంపం వల్ల ఉక్కు పరిశ్రమలకు ఏమేరకు నష్టం వాటిల్లిందీ ఇంకా తెలియరాలేదు. ఇళ్లలోని వస్తువులు ఊగడంతో జనం వీధుల్లోకి వచ్చేశారు.