అంతర్జాతీయం

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెడ్‌బ్లఫ్, నవంబర్ 15: అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం రేపాయ. ఓ దుండగుడి తుపాకీ తూటాలకు ఐదుగురు బలైపోయారు. ఉత్తర కాలిఫోర్నియాలోని రెంఛో టెహామా ఎలిమెంటరీ స్కూల్ లక్ష్యంగా సాయుధ దుండగుడు కాల్పులు జరిపాడు. తుపాకీ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. ఇద్దరు పాఠశాల విద్యార్థులతోపాటు పదిమంది గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. భారత కాలమాన ప్రకారం మంగళవారం అర్ధరాత్రి ఈ కాల్పులు జరిగాయి. కాల్పులకు గల కారణాలపై విచారణ జరుగుతోంది. తరువాత పోలీసులు గాలించి దుండగుడిని మట్టుబెట్టారు. నార్త్ సక్రామెంటోకు 130 మైళ్ల దూరంలోని రూరల్ రెంఛోటెహామా ఎలిమెంటరీ స్కూల్‌లోకి ఆటోమెటిక్ గన్, రెండు హ్యాండ్ గన్లతో దూసుకువెళ్లిన సాయుధుడు ఏకపక్షంగా కాల్పులకు తెగబడ్డాడు. స్కూల్‌లో ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే ఓ మహిళ బైక్‌పై వెళ్తున్న విద్యార్థి గాయాలపాలయ్యాడని టెహామా కౌంటీ పోలీసు అధికారి ఫిల్ జాన్‌స్టన్ వెల్లడించారు. కాల్పుల వార్త తెలిసిన వెంటనే హుటాహుటిన పోలీసులు రంగంలోకి దిగారు. గాలింపు తరువాత అతడిని మట్టుబెట్టారు. చికిత్స పొందుతున్న వారి వివరాలు వెల్లడించడానికి వైద్యులు నిరాకరించారు.