అంతర్జాతీయం

స్వలింగ వివాహాల’కు ఆస్ట్రేలియన్ల మొగ్గు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, నవంబర్ 15: స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాల్సిందేనని ఆస్ట్రేలియాలో మెజారిటీ ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆ దేశ చరిత్రలోనే అరుదైన రీతిలో జరిగిన ‘ప్రజాభిప్రాయ సేకరణ’లో ఈ విషయం తేటతెల్లమైంది. స్వలింగ వివాహాలకు మద్దతుగా తాను కూడా ఓటు వేశానని, వచ్చే నెలలో క్రిస్మస్ నాటికి పార్లమెంటులో ప్రత్యేక చట్టం ఆమోదం పొందుతుందని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి మాల్కమ్ టర్న్‌బుల్ వ్యక్తం చేశారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలా? వద్దా? అనే విషయమై ఆస్ట్రేలియాలో జరిగిన సర్వేలో 1.27 కోట్ల మంది ప్రజలు పాల్గొన్నారు.
స్వలింగ వివాహాలను చట్టబద్ధంగా అనుమతించాలని 61 శాతం మంది ఓటు వేశారు. ఇది చట్టవిరుద్ధమంటూ 38.4 శాతం మంది వ్యతిరేకించారు. సర్వే ఫలితాలు వెలువడిన వెంటనే ఆస్ట్రేలియన్లు పెద్ద ఎత్తున వీధుల్లోకి చేరుకుని వేడుకలు చేసుకున్నారు.