అంతర్జాతీయం

పొగ మంచుతో ప్రమాదమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 16: భారత రాజధాని ఢిల్లీసహా దేశంలో అనేక నగరాలు, మరోపక్క పాకిస్తాన్‌లోని పలు పట్టణాల్లోనూ దట్టమైన పొగమంచు అలుముకోవడం అన్నది ప్రమాదకరమైనదేనని, అనారోగ్య పరిస్థితులకు దారితీసే అవకాశం ఉన్నదని అమెరికా వాతావరణ పరిశోధన సంస్థ హెచ్చరించింది. ఈ పట్టణాల్లో రానున్న కొన్ని నెలలపాటు వాయు నాణ్యతకు సంబంధించి ఇదే రకమైన ప్రతికూల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని కూడా వెల్లడించింది. అంతేకాకుండా ఈ పట్టణాలు వాటంతట అవే మంచుమయమై ప్రమాదకర అనారోగ్య ప్రాంతాలుగా మారిపోయే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర భారతంలోనూ పాకిస్తాన్‌లోనూ మంచు దట్టంగా అలముకునే కాలం కాబట్టి అతిశీతల పరిస్థితులకు, అలాగే కాలుష్య కారణంగా వాయు నాణ్యత తగ్గిపోవడానికి అవకాశం ఉందని తెలిపింది. ఈ రకమైన పరిస్థితులకు సంబంధించి ఉపగ్రహ ఛాయాచిత్రాలను కూడా ఈ జాతీయ సముద్ర, వాతావరణ నిర్వహణ సంస్థ (ఎన్‌ఓఏఏ) విడుదల చేసింది. ఇలాంటి పరిస్థితులకు దారితీస్తున్న కారణాలను, వాతావరణం కాలుష్యమయం కావడానికి ఏ అంశాలు దోహదం చేస్తున్నాయో కూడా ఈ సంస్థ వివరించింది. ఇంధనాన్ని మండించడం, పంటలను తగలబెట్టడం, ఇతరత్రా చోటుచేసుకున్న ఈ రకమైన పరిస్థితులే పొగమంచు అలముకోడానికి కారణాలవుతున్నాయని తెలిపింది. ఉత్తర భారతం, పాకిస్తాన్‌లోని కొన్ని పట్టణాల శివారు ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని అన్నారు. వీటివల్లే పట్టణాల్లో పొగమంచు ప్రమాదకర స్థాయికి చేరుకుందని సంస్థ వివరించింది. పొగమంచు తీవ్రతవల్ల వాయు కదలిక ఉండదని, ఇది కలుషితం కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని వెల్లడించింది.