అంతర్జాతీయం

ప్రపంచ సుందరి మన మానుషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, నవంబర్ 18: చైనాలో జరిగిన అందాల పోటీలో భారతీయ యువతి మానుషి చిల్లార్ ‘మిస్ వరల్డ్’ కిరీటాన్ని దక్కించుకుంది. హర్యానాకు చెందిన ఇరవై ఏళ్ల వైద్య విద్యార్థిని మారుషి ఈ ప్రతిష్ఠాత్మక పోటీలో 108 మంది ప్రత్యర్థులను పక్కకునెట్టి ఈ ఘనతను సాధించింది. దీంతో 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌కు ఇపుడు ‘మిస్ వరల్డ్’ టైటిల్ దక్కినట్లయ్యింది. చైనాలోని సాన్య నగరంలో శనివారం అట్టహాసంగా జరిగిన ‘మిస్ వరల్డ్-2017’ తుది పోటీలను ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయడంతో దేశదేశాల్లో ఎడతెగని ఉత్కంఠ కొనసాగింది. ఈ పోటీ తుది ఘట్టంలో ఇంగ్లాండ్, ఫ్రాన్స్, కెన్యా, మెక్సికోలకు చెందిన నలుగురు యువతులకు మానుషి గట్టి పోటీ ఇచ్చి చివరికి కిరీటాన్ని కైవసం చేసుకుంది. గత ఏడాది ‘మిస్ వరల్డ్’ అయిన స్ట్ఫెనీ డెల్ వల్లె మానుషికి కిరీట ధారణ చేసింది. అందాల పోటీలు ముగిసిన వెంటనే విజేతగా మానుషి నిలిచినట్లు నిర్వాహకులు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మొదటి, రెండవ రన్నర్స్ అప్‌లుగా మిస్ ఇంగ్లాండ్ స్ట్ఫోనీ హిల్, మిస్ మెక్సికో ఆండ్రియా మెజా నిలిచారు.
‘పిల్లల కోసం తల్లులందరూ ఎన్నో త్యాగాలు చేస్తారు.. ఇంట్లో అందరికీ సేవలు చేసే అమ్మే గొప్ప ఉద్యోగి.. ఆమె సేవలకు వేతనం ఎంతో వెలకట్టలేం..’ అని ‘విశ్వసుందరి’ మానుషి తన మనోభావాలను ఆవిష్కరించింది. భారత్‌కు ‘విశ్వసుందరి’ కిరీటాన్ని అందించిన ఆరవ వనితగా ఆమె రికార్డు సృష్టించింది. 1966లో రీటా ఫెరీరా, 1994లో ఐశ్వర్య రాయ్, 1997లో డయానా హేడన్, 1999లో యుక్తాముఖి, 2000 సంవత్సరంలో ప్రియాంకా చోప్రాలకు ఈ ఘనత దక్కింది. మెడిసిన్ విద్యార్థి అయిన మానుషి భవిష్యత్‌లో హృద్రోగ నిపుణురాలిగా సేవలందించాలని, పలుచోట్ల ఆసుపత్రులను నెలకొల్పి గ్రామీణ ప్రాంతాల వారికి వైద్యసేవలు అందించాలని భావిస్తున్నట్లు తెలిపింది. సంప్రదాయ నృత్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమెకు పారాగ్లయిడింగ్, బంగీ జంపింగ్, స్కూబా డైవింగ్, చిత్రలేఖనం అంటే ఎంతో ఇష్టం. ‘కలలను సాకారం చేసుకోవడంలో సమస్యలు ఎదురైతే కడదాకా పోరాడాలి.. చేసే పనిపై నమ్మకం ఉంటే మన జీవనానికి విలువ ఉంటుంది..’ అని తన మనోభావాలను వెల్లడించి తుది పోటీలో న్యాయనిర్ణేతలను మానుషి మెప్పించింది.

చిత్రం..దక్షిణ చైనాలోని సాన్యలో జరిగిన మిస్ వరల్డ్ ఫైనల్స్ పోరులో
విజేతగా తన పేరు ప్రకటించటంతో అభివాదం చేస్తున్న భారత అందాల సుందరి మానుషి చిల్లార్
*
అందం ఆనందమవగ
చందంగా బౌద్ధికతయు విందేజేయన్
పందెం గెలిచెను మానుషి
చిందేసెను దేశమంత వందేయనుచున్!