అంతర్జాతీయం

నేపాల్‌లో రైల్వేలైన్ నిర్మాణానికి చైనా ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మండు, నవంబర్ 18: నేపాల్ సరిహద్దు ప్రాంతంలో రైల్వేలైన్ నిర్మాణంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని ఆ దేశంలోని చైనా రాయబారి యూ హాంగ్ తెలిపారు. అంతర్జాతీయ సంబంధాలను మరింతగా మెరుగుపరచుకునేందుకు, మానవాళికి మేలైన భవిష్యత్ కోసం చైనా పనిచేస్తుందని యూ హాంగ్ పేర్కొన్నారు. తాము చేపట్టిన ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్’ (బీఆర్‌ఐ) కార్యక్రమంలో చేరేందుకు నేపాల్ సుముఖత చూపడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. నేపాల్ సహా అనేక దేశాలకు ‘బీఆర్‌ఐ’ వల్ల విభిన్న రంగాల్లో మేలు జరిగేందుకు అవకాశాలుంటాయని తెలిపారు. వివిధ దేశాల ప్రజల మధ్య సంబంధాలు, ఆర్థిక పరిస్థితులు, వాణిజ్య అవకాశాలు మరింతగా మెరుగుపడతాయన్నారు. ‘బిఆర్‌ఐ’లో చేరుతున్నట్లు చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్ సమక్షంలో గత మేలో నేపాల్ ప్రతినిధులు సంతకాలు చేశారు. సరిహద్దుల్లో రైల్వే వ్యవస్థ ఏర్పాటుకు నేపాల్, చైనా కలసి పనిచేస్తాయని హాంగ్ తెలిపారు.