అంతర్జాతీయం

టిబెట్‌లో భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, నవంబర్ 18: టిబెట్‌లోని నింగ్చీ నగరంతో పాటు సమీప ప్రాంతాల్లో శనివారం ఉదయం బలమైన భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.9గా నమోదైంది. భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో సంభవించిన ఈ భూకంపం ధాటికి ఆస్తినష్టం భారీగానే జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఈ విలయంలో ఎవరూ మరణించలేదని అధికార వర్గాలు తెలిపాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో పాటు పెద్ద సంఖ్యలో భవనాలు నేలమట్టం అయ్యాయి. పలు గ్రామాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. నింగ్చీ నగరానికి పది కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారని ప్రభుత్వానికి చెందిన క్సిన్‌హువా వార్తా సంస్థ తెలిపింది. భూకంపం అనంతరం సమీప గ్రామాల్లో నాలుగు సార్లు స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఝాక్సింగాంగ్ గ్రామంలో భూకంపం సంభవించినపుడు స్థానికులు భయాందోళనలకు లోనై ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. ఈ గ్రామంలో ఆరు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫార పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికపై చర్యలు చేపట్టారు. 500 చదరపు మీటర్ల పరిధిలో భూకంపం తీవ్రత అధికంగా ఉన్నట్లు చైనా భూకంప అధ్యయన సంస్థ నిపుణులు తెలిపారు. నింగ్చి నగరం, తాంగ్మై ప్రాంతాన్ని కలిపే జాతీయ రహదారి దెబ్బతింది. పలు గ్రామాలకు వెళ్లే రహదారులపై భారీ బండరాళ్లు పడడంతో రాకపోకలకు ఇబ్బంది కలిగింది. బండరాళ్లను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బందిని కూడా పలుచోట్ల అప్రమత్తం చేశారు. కొన్ని ప్రాంతాల్లో బాధితులకు హెలికాప్టర్ ద్వారా ఆహార పదార్థాలను అందజేశారు. దెబ్బతిన్న రహదారులు, వంతెనలను పరిశీలించేందుకు రవా ణా శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పోమె, జయుల్ ప్రాంతాల్లో టెలికమ్యూనికేషన్ వ్యవస్థకు నష్టం జరిగింది.
రాజస్థాన్‌లోనూ భూ ప్రకంపనలు
జైపూర్: రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో శనివారం భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.2గా నమోదైందని అధికారులు తెలిపారు. జోధ్‌పూర్ వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించారు. కొద్ది సెకన్లపాటు భూమి కంపించడంతో వివిధ ప్రాంతాల్లో జనం భయకంపితులయ్యారు.