అంతర్జాతీయం

భారత్ యుక్తి.. బ్రిటన్ కుయుక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, నవంబర్ 19: భారత్- బ్రిటన్‌ల మధ్య గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూలేనంత తీవ్రస్థాయిలో దౌత్యపరమైన సమరం రాజుకుంటోంది. అంతర్జాతీయ న్యాయమూర్తి పదవికి భారత్ తరఫున పోటీచేస్తున్న దల్వీర్ భండారీకి మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో, ఆయన ఎన్నికకు దెబ్బకొట్టడనికి బ్రిటన్ అన్ని విధాలుగానూ కుయుక్తులు పన్నుతోంది. సోమవారం జరగనున్న ఈ కీలక ఎన్నికకు సంబంధించి తన పట్టును మరింత బిగించేందుకు బ్రిటన్ దౌత్యపరంగా ప్రయత్నిస్తోందని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశంగా తనకున్న అధికారాన్ని ఆసరా చేసుకుని ఐసీజే ఎన్నిక ప్రక్రియను నిలిపివేసేలా పావులు కదుపుతోందన్న కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి ఐరాస భద్రతా మండలిలో విస్తృతమైన చర్చలు జరిగాయి.
సోమవారం జరిగే సింగల్ రౌండ్ బ్యాలెటింగ్ తరువాత తదుపరి ఓటింగ్ జరగకుండా నిలిపివేసే అంశాన్ని తాము పరిశీలిస్తున్నట్టు యునైటెడ్ కింగ్‌డమ్ సంకేతప్రాయంగా తెలిపింది. ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ నుంచి ముగ్గురు సభ్యులూ, భద్రతా మండలి నుంచి ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీతో సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయాలని బ్రిటన్ చేసిన ప్రతిపాదనను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. బ్రిటన్ ప్రయత్నాలు ఏమాత్రం ముందుకు సాగకుండా భారత్ కూడా తనదైన రీతిలోనే ఇతర దేశాల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటి వరకూ ఈ రకమైన ఎన్నిక ప్రక్రియను అంతర్జాతీయ న్యాయస్థానం చరిత్రలోనే ఉపయోగించిన సందర్భం లేదని భారత్ తెలిపింది. ఈ పదవికి బ్రిటన్ తరఫున క్రిష్ట్ఫోర్ గ్రీన్ వుడ్ పోటీ పడుతున్నారు. అయితే, ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌లో ఆయనకు మద్దతు తగ్గడం, భారత్ అభ్యర్థి దల్వీర్ భండారీకి మద్దతు పెరగడంతో బ్రిటన్ ఈ తాజా పాచికను తెరపైకి తెచ్చింది. ఇప్పటికే బ్రిటన్ ధోరణిపై అనేక దేశాలు తీవ్రస్థాయిలోనే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
ఇప్పటివరకూ జరిగిన ఓటింగ్ ప్రకారం భారత అభ్యర్థికి మూడింట రెండొంతుల మద్దతు లభించింది. అంటే, 121 దేశాలు భారత్ అభ్యర్థికి మద్దతు పలికాయి. అయితే, భద్రతా మండలిలో తనకున్న బలాన్ని ఉపయోగించుకున్న బ్రిటన్, తన అభ్యర్థికి స్వల్పస్థాయి ఆధిక్యతను సంపాదించుకోగలిగింది. ఐసీయు పదవి దక్కాలంటే ఇటు జనరల్ అసెంబ్లీలోనూ, అటు భద్రతా మండలిలోనూ మెజార్జీ సభ్యుల మద్దతు అవసరం అవుతుంది. ఐసీజే న్యాయమూర్తుల ఎన్నికకు సంబంధించి గతంలోకూడా ఎన్నోసార్లు వివాదాస్పద అంశాలు తలెత్తాయి. 2011, 14లో కూడా ఈరకమైన ప్రతిష్ఠంభనే ఏర్పడింది. అయితే ఆ వివాదాలు అన్నింటినీ మరిన్ని రౌండ్ల ఓటింగ్ ద్వారా పరిష్కరించుకున్నారు. కానీ, ఇప్పుడు తమకు పరిస్థితి ప్రతికూలంగా మారడంతో తదుపరి ఓటింగ్ అవసరం లేదని యుకె కొత్త మెలిక పెడుతోంది. సోమవారం జరిగే ఓటింగ్‌తో ఈ ప్రక్రియను నిలిపివేసి, అనంతర నిర్ణయాలు తీసుకునేందుకు ఐరాస, జనరల్ అసెంబ్లీ సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలని వాదిస్తోంది. ఇప్పటికే భారత దేశం దౌత్యపరంగా ఎన్నో దేశాల మద్దతును కూడగట్టుకుంది. ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, లాటిన్ అమెరికా దేశాలు భారత్ అభ్యర్థికే మద్దతు పలుకుతున్నాయి. ఎప్పుడో 96ఏల్ల క్రితం ఈ రకమైన సంయుక్త కమిటీ ప్రక్రియను ఐసీజే ఎన్నికకు సంబంధిచి ఉపయోగించటం జరిగింది. ఇప్పుడు పరిస్థితి తనకు ప్రతికూలంగా కావడంతో, కాలం చెల్లిన ఆ విధానానే్న బ్రిటన్ మళ్లీ తెరపైకి తెచ్చే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందన్న వాదన వినిపిస్తోంది.