అంతర్జాతీయం

పాక్‌లో లారీ-వ్యాన్ ఢీ.. 20 మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, నవంబర్ 20: పాకిస్తాన్‌లోని సింథ్ రాష్ట్రంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికుల వ్యాన్‌ను బొగ్గు లారీ ఢీకొన్న ప్రమాదంలో 20 మంది దుర్మరణం చెందారు. ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో 27మంది చనిపోయిన ఘటన మరిచిపోకముందే మళ్లీ ఈ దారుణం చోటుచేసుకుంది. ఖైర్‌పూర్ ప్రాంతంలోని తెహ్రీ బైపాస్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఉదయం దట్టమైన పొగ మంచుతో పాటు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. సుక్కూర్ వైపువెళ్తుండగా బొగ్గు ట్రక్ ఢీకొంది. కాగా మృతులందరూ కూలీలేనని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యున్ తెలిపింది. భారీ లోడుతోవస్తున్న ఓ వాహనాన్ని ఓవర్‌టేక్ చేయబోయి వ్యాన్‌ను ఢీకొందని పోలీసులు చెప్పారు.