అంతర్జాతీయం

ఏ లక్ష్యమైనా తుత్తునియలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, నవంబర్ 20: ఇప్పటివరకూ మనం ఖండాంతర క్షిపణులనే చూశాం. అంతర్జాతీయంగా అన్ని విధాలుగా దూసుకుపోతున్న చైనా మరో రెండడుగులు ముందుకేసి ప్రపంచంలో ఏ లక్ష్యాన్నైనా చేధించే సామర్థ్యంగల బాలిస్టిక్ క్షిపణిని త్వరలోనే పరీక్షించబోతోంది. కేవలం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతం అని కాకుండా ఈ క్షిపణుల ద్వారా ప్రపంచంలో ఏమూల ఉన్నా తన శత్రు లక్ష్యాన్ని చైనా విచ్ఛిన్నం చేయగలుగుతుందని సోమవారం వెలువడిన మీడియా కథనాలను బట్టి స్పష్టమవుతుంది. ఇప్పటికే ఈ అంతర్ ఖండ బాలిస్టిక్ క్షిపణి తుదిమెరుగులు దిద్దుకుంటోందని, వచ్చే ఏడాది మొదట్లోనే చైనా సైనిక దళాల అమ్ముల పొదిలో చేరుతుందని చైనా మీడియా తెలిపింది. డాంగ్ ఫెంగ్-41గా పేర్కొంటున్న ఈ క్షిపణి వేగం మ్యాక్‌టన్ కంటే చాలా ఎక్కువని, శత్రు లక్ష్యాలను తుత్తునియల చేయగలిగే శక్తి దీనికి ఉంటుందని మీడియా తెలిపింది.
ముఖ్యంగా ప్రత్యర్థి దేశాలను హెచ్చరించడానికి, వాటి రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడానికి ఈ తిరుగులేని క్షిపణి చైనాకు అనితర సాధ్యమైన శక్తినే అందిస్తుదని వెల్లడించింది. 2012లో తొలిసారిగా ఈ క్షిపణికి సంబంధించిన వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకూ 8సార్లు దీని పాటవాన్ని పరీక్షించారు. ఈ ఎనిమిది పరీక్షల్లో అన్ని విధాలుగా ఇది రాటుదేలిందని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ తెలిపింది.