అంతర్జాతీయం

నైజీరియాలో ఆత్మాహుతి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైజీరియా, నవంబర్ 21: ఈశాన్య నైజీరియాలోని ఓ మసీదులో దారుణం చోటుచేసుకుంది. మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఉగ్రవాది తనను తాను పేల్చేసుకోవడంతో కనీసం 50మంది పౌరులు మృతిచెందారు. ఈ ఘాతుకం బోకో హారమ్ జిహాదీల పనేనని పోలీసులు వెల్లడించారు. అడమావా రాజధాని యోలాకు 200 కిలోమీటర్ల దూరంలోని ముబి పరిధిలోని ఉంగువార్ షువా మసీదులో ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున ప్రార్థనలు జరుగుతున్న సమయంలో బొకో హారమ్ ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు చెబుతున్నారు. ‘ముబి మసీదులో చోటుచేసుకున్న ఉగ్రవాద దాడిలో 50మంది మరణించినట్టు గుర్తించాం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు’ అని అడమావా రాష్ట్ర పోలీసు అధికార ప్రతినిథి ఓత్మన్ అబుబకర్ వెల్లడించారు. మృతుల విషయంలో కచ్చితమైన సమాచారం ఇవ్వలేమని, అనేక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అన్నారు. ‘ప్రార్థనలకు హాజరైన వారితో కలిసి మసీదులోకి చొరబడిన ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు’ అని ఆయన వెల్లడించారు. ఈ ఘాతుకం వెనుక ఎవరి హస్తం ఉందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ‘ఇక్కడి పరిణామాలు అందరికీ తెలుసు. ఆత్మాహుతి దాడి వెనుక ఎవరున్నారన్నది ప్రత్యేకించి చెప్పలేం. కాకపోతే, దీని వెనుక ఎవరు ఉన్నారన్నది అంచనా వేయడం కష్టమైన పనేమీ కాదు’ అన్నారు.

చిత్రం..ఆత్మాహుతి దాడిలో ధ్వంసమైన మసీదు