అంతర్జాతీయం

హఫీజ్‌ను విడుదల చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, నవంబర్ 22: 26/11 ముంబయి పేలుళ్ల సూత్రధారి, ప్రముఖ ఉగ్రవాద సంస్థ జమాత్- ఉద్- దవా (జెయుడి) అధినేత హఫీజ్ సరుూద్‌ను గృహనిర్బంధం నుంచి విడుదల చేయాలని పాకిస్తాన్‌లోని పంజాబ్ న్యాయస్థానం బుధవారం నాడు ఆదేశించింది. ఈ ఏడాది జనవరి నుంచి హఫీజ్ గృహనిర్బంధంలో ఉండగా, ఆ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. తన గృహనిర్బంధాన్ని మరో నెలరోజుల పాటు పొడిగించాలన్న పంజాబ్‌లోని హోం శాఖ నిర్ణయాన్ని హఫీజ్ లాహోర్ హైకోర్టులో సవాల్ చేశాడు. ప్రజా భద్రతా చట్టం కింద ఇతనికి మరో నెల రోజులపాటు గృహనిర్బంధాన్ని పొడిగించాలని గత నెల 24న హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు హఫీజ్ నిర్బంధాన్ని మరో మూడునెలల పాటు పొడిగించాలని పాకిస్తాన్ ప్రభుత్వం పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై వాదనలు విన్నాక గృహనిర్బంధాన్ని పొడిగించేందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. వెంటనే హఫీజ్‌ను విడుదల చేయాలని ఆదేశించింది. మరో కేసులో ఇతని విచారణ అవసరం లేనపుడు గృహనిర్బంధం నుంచి విడుదల చేయవచ్చని కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.
గత జనవరి 31న హఫీజ్ సహా అతని అనుచరులు అబ్దుల్లా ఉబెద్, మాలిక్ జాఫర్ ఇక్బాల్, అబ్దుల్ రెహ్మాన్ అబిద్, క్వాజీ కాషిఫ్ హుస్సేన్‌లను 90 రోజుల పాటు ఉగ్రవాద వ్యతిరేక చట్టాల కింద పంజాబ్ ప్రభుత్వం గృహనిర్బంధంలోకి తీసుకుంది. అయితే, గత నెలలోనే సరుూద్ అనుచరులకు నిర్బంధం నుంచి విముక్తి లభించింది. కేవలం పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా సరుూద్‌ను గృహనిర్బంధంలో ఉంచేందుకు తాము అనుమతించబోమని, సరైన ఆధారాలుంటే అందుకు సమ్మతిస్తామని గతంలోనే కోర్టు తెలిపింది. కాగా, అంతర్జాతీయ ఉగ్రవాది అయిన సరుూద్‌పై డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం పది మిలియన్ డాలర్ల రివార్డును గతంలోనే ప్రకటించింది.