అంతర్జాతీయం

రోహింగ్యాలు ఇక వెనక్కి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాంగన్, నవంబర్ 23: రోహింగ్యా ముస్లింలను స్వరాష్ట్రానికి పంపే విషయంలో మైన్మార్-బంగ్లాదేశ్‌ల మధ్య గురువారం ఒప్పందం కుదిరింది. మైన్మార్‌లోని రఖీనా రాష్ట్రంలో సైనిక దాడుల నుంచి తప్పించుకునేందుకు వేల సంఖ్యలో రోహింగ్యాలు బంగ్లాకు తరలివచ్చి అక్కడి శిబిరాల్లోనే కాలక్షేపం చేస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు నెల నుంచి ఇప్పటివరకు దాదాపు 6లక్షల 20వేల మంది రోహింగ్యాలు మైన్మార్ నుంచి బంగ్లాకు పారిపోయారు. రోహింగ్యాలను ఏరివేసే ఉద్దేశంతోనే మైన్మార్ సైన్యం దాడులు జరుపుతోందంటూ ప్రపంచవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమైన నేపథ్యంలో మైన్మార్ నాయకురాలు ఆంగ్‌సాంగ్ సూకీ, బంగ్లా విదేశాంగ మంత్రి ఎ.హెచ్.మహమూద్ అలీ మధ్య చర్చలు జరిగాయి. అనంతరం రోహింగ్యాలను వెనక్కి పంపే అంశంపై ఒప్పందం కుదిరినట్లు మైన్మార్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

చిత్రాలు.. బంగ్లాదేశ్‌లోని యుకియా జిల్లాలో పునరావాసం పొందుతున్న రోహింగ్యాలు
* గురువారం యాంగాన్‌లో మైన్మార్ నాయకురాలు
ఆంగ్‌సాన్ సూకీ, బంగ్లా విదేశాంగ మంత్రి ఎ.హెచ్. మహమూద్ అలీ కరచాలనం