అంతర్జాతీయం

అధికారంలోకి వస్తే అబార్షన్ హక్కులు: హిల్లరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 12: అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలిగా తాను ఎన్నికైతే మహిళలకోసం అబార్షన్ హక్కుల చట్టాన్ని తీసుకువస్తానని డెమొక్రాట్ పార్టీ నామినీ హిల్లరీ క్లింటన్ తాజాగా ప్రకటించారు. జాతీయ పునరుత్పత్తి ఆరోగ్య ప్రచార సంస్థ చాలాకాలంగా పోరాడుతున్న అబార్షన్ హక్కులను నిజం చేస్తానని ఆమె వెల్లడించారు. తన ప్రత్యర్థి రిపబ్లికన్ నామినీ డొనాల్డ్ ట్రంప్‌ను మహిళా హక్కుల వ్యతిరేకిగా ఆమె అభివర్ణించారు. ‘ఆయన పెయిడ్ ఫ్యామిలీ లీవ్‌ను రద్దు చేస్తామంటున్నారు. కుటుంబ విధానాన్ని నిర్వీర్యం చేస్తారు. అబార్షన్ హక్కులను కాలరాసేందుకు అనుకూలురైన న్యాయమూర్తులను కోర్టులో నియమిస్తారు’ అని హిల్లరీ విమర్శించారు. కాగా ఫాక్స్ న్యూస్ పోల్ తాజాగా నిర్వహించిన సర్వే ప్రకారం 50శాతం మంది మహిళలు హిల్లరీ క్లింటన్‌కే మొగ్గు చూపుతున్నారు.