అంతర్జాతీయం

మరోసారి మహాధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, జూన్ 12: పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌కు వ్యతిరేకంగా మరోసారి ప్రజలను కదిలించి మహాధర్నా చేస్తానని ప్రతిపక్ష తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు. పనామా పత్రాల లీకేజీ నేపథ్యంలో ‘మనీలాండరింగ్’ ఆరోపణలకు జవాబుదారీతనం వహించకుండా షరీఫ్ తప్పించుకోజాలరని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ మొత్తం జనాభా 182 మిలియన్లలోని కనీసం పది శాతం జనాభాను అంటే 18 మిలియన్ల మందిని తాను ఆందోళన కార్యక్రమంలోకి తీసుకొస్తానని అన్నారు. పనామా పత్రాల లీకేజీలో భాగంగా బయటకు వచ్చిన పత్రాలు షరీఫ్ పిల్లలకు విదేశాల్లో అనేక కంపెనీలు ఉన్నాయని, వాటిని ఉపయోగించుకొని వారు విదేశాలలో ఆస్తులు కొనుగోలు చేశారని వెల్లడించాయి. అయితే తాము ఎలాంటి తప్పు చేయలేదని షరీఫ్, ఆయన పిల్లలు ఖండించారు.

చిత్రం ఇమ్రాన్ ఖాన్