అంతర్జాతీయం

రెండుగా చీలిన ఎన్‌ఎస్‌జి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూన్ 12: అణు సరఫరా దేశాల గ్రూపు (ఎన్‌ఎస్‌జి)లో భారత్‌కు సభ్యత్వం కల్పించడానికి అమెరికా గట్టిగా ప్రయత్నిస్తున్నప్పటికీ, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పిటి)పై సంతకం చేయని దేశాలను గ్రూపులో చేర్చుకోవడంపై ఎన్‌ఎస్‌జి రెండుగా చీలిపోయి ఉందని చైనా అంటోంది. అంతేకాదు ఈ నెల 9న వియన్నాలో జరిగిన ఎన్‌ఎస్‌జి సమావేశంలో గ్రూపులో చేరడానికి భారత్, మరికొన్ని దేశాలు చేస్తున్న ప్రయత్నాలపై ఎలాంటి చర్చా జరగలేదని కూడా వాదిస్తోంది. ‘అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయని భారత్ లేదా ఇతర ఏ దేశాన్నయనా ఎన్‌ఎస్‌జిలో చేర్చుకోవడంపై వియన్నాలో ఎలాంటి చర్చా జరగలేదు’ అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హోంగ్ లీ ఈ వారం వియన్నాలో జరిగిన సమావేశాన్ని ప్రస్తావిస్తూ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్‌ఎస్‌జి చైర్‌పర్సన్, అర్జెంటీనా రాయబారి రఫాయెల్ మారియానో గ్రోసీ ఈ నెల 9న వియన్నాలో ఎన్‌ఎస్‌జి అనధికారిక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశానికి ఎలాంటి అజెండా లేదని ఎన్‌ఎస్‌జిలోని సభ్యులందరి అభిప్రాయాలను తెలుసుకొని ఈ నెల 24న సియోల్ జరగబోయే ప్లీనరీ సమావేశంలో ఒక నివేదిక సమర్పించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చైర్‌పర్సన్ చెప్పారని హోంగ్ లీ చెప్పారు. అయితే వియన్నా సమావేశంలో భారత్ సభ్యత్వంపై చర్చ జరిగిందని, చర్చలు అసంపూర్తిగా ముగిశాయని ఇంతకుముందు అక్కడి దౌత్యవర్గాలు తెలిపాయి.
ఎన్‌పిటిపై సంతకం చేయని దేశాలను ఎన్‌ఎస్‌జిలో సభ్యులుగా చేర్చుకోరాదని, దానివల్ల అణ్వస్త్ర వ్యాప్తిని అడ్డుకోవడానికి జరుపుతున్న కృషి నీరుగారిపోతుందని చైనా మొదటినుంచీ వాదిస్తోంది. భారత్‌ను చేర్చుకోవడంపై ఎన్‌ఎస్‌జిలో నిర్మాణాత్మక చర్చ జరగాలని హోంగ్ అన్నారు.