అంతర్జాతీయం

మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, డిసెంబర్ 11: భారత్‌కు చెందిన కొందరు నేతలు అక్కడి రాజకీయాల్లో తన పేరును ప్రస్తావించడం పట్ల పాకిస్తాన్ అభ్యంతరం తెలిపింది. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కొందరు కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ అధికారులను రహస్యంగా కలిశారంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో పాక్ విదేశాంగ శాఖ తీవ్రంగానే స్పందించింది. భారత అంతర్గత రాజకీయాల్లో తమ ప్రమేయం ఉందంటూ వస్తున్న వ్యాఖ్యలు నిరాధారమైనవి, బాధ్యతారాహిత్యంతో చేసినవని అంటూ పాక్ విదేశాంగ కార్యాలయం అధికార ప్రతినిధి మహమ్మద్ ఫైజల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అహ్మద్ పటేల్ గుజరాత్ ముఖ్యమంత్రి కావాలంటూ పాకిస్తాన్ కోరుకుంటోందని కూడా మోదీ ఆరోపణలు చేసినట్లు వార్తలొచ్చాయి. ‘నేను ప్రధాని పదవి చేపట్టాక కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ పాకిస్తాన్ వెళ్లి అక్కడి నేతలతో మంతనాలు జరిపారు.. మోదీని తొలగిస్తే తప్ప భారత్, పాక్‌ల మధ్య సంబంధాలు మెరుగుపడవని వారితో అయ్యర్ అన్నారు’ అని కూడా మోదీ ఆరోపించారు. ఆ మధ్య అయ్యర్ ఏర్పాటు చేసిన సమావేశానికి మన్మోహన్ సింగ్, పాక్ మాజీ విదేశాంగ మంత్రి హాజరై గుజరాత్ ఎన్నికలపై చర్చించారని, పాక్ ఆర్మీ మాజీ డైరెక్టర్ జనరల్ సర్దార్ అర్షద్ షరీఫ్ గుజరాత్ ఎన్నికల్లో జోక్యం చేసుకుంటున్నారని మోదీ ఆరోపించారు.