అంతర్జాతీయం

17 మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొగదిషు, డిసెంబర్ 14: సోమాలియా రాజధాని మొగదిషులోని పోలీసు అకాడమీపై గురువారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 17 మంది మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు. ఇస్లామిస్ట్ ఉగ్రవాదే ఈ ఘాతుక చర్యకు పాల్పడ్డాడని కల్నల్ మహ్మద్ ఆడెన్ వెల్లడించారు. పేలుళ్లల్లో గాయపడ్డ అధికారుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని ఆయన తెలిపారు. జనరల్ ఖహియే పోలీసు అకాడమీలోకి చొరబడ్డ ఉగ్రవాది తనను తాను పేల్చుకుని విస్ఫోటనం సృష్టించాడు. ఉదయం వేళ ఎక్స్‌ర్‌సైజ్‌లు చేయడానికి అధికారులు అకాడమీకి చేరుకున్నారు. ఈ నెల 20 సోమాలియా పోలీస్ డే ఉన్నందున దానికోసం ప్రత్యేకంగా ఈ రిహార్సిల్స్ జరుగుతున్నట్టు కెప్టెన్ మహ్మద్ హుస్సేన్ తెలిపారు. ఉగ్రవాది ఎవరికీ అనుమానం రాకుండా అధికారులతోపాటు అకాడమీలోకి ప్రవేశించాడు. పైగా క్రీడా దుస్తులు ధరించి వాటి వెనక పేలుడు పదార్థాలు అమర్చుకున్నట్టు హుస్సేన్ వెల్లడించారు. రిహార్సిల్స్ పెరేడ్ లైన్‌లోకి వచ్చి తనను తాను పేల్చుకున్నట్టు ఆయన వివరించారు. భారీ విధ్వంసం సృష్టించాలన్న లక్ష్యంతోనే ఇస్లామిస్ట్ ఉగ్రవాది లోనికి వచ్చాడని ఫరా ఒమర్ అనే పోలీసు అధికారి తెలిపారు. ఎక్స్‌ర్‌సైజ్ కోసం సైనికులందరూ ఓ చోట చేరి ఉండగా ఆత్మాహుతి బాంబు పేలిందని ఆయన అన్నారు. ఇలా ఉండగా పేలుడు తమ పనేనని సోమాలియాకు చెందిన అల్-షాబాబ్ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఈ ఉగ్ర సంస్థ అల్‌ఖయిదా అనుబంధంగా పనిచేస్తోంది.

చిత్రం..ఆత్మాహుతి దాడి జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు చేపడుతున్న పోలీసులు