అంతర్జాతీయం

పాక్‌లో హిందూ వృద్ధుడిపై కానిస్టేబుల్ దాష్టీకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూన్ 12: మస్లింలు ఎంతో పవిత్రమైన రంజాన్ నెలలో ఇఫ్తార్‌కు ముందు తినుబండారాలు అమ్మాడన్న కారణంపై పాకిస్తాన్‌లో ఒక పోలీసు కానిస్టేబుల్ ఓ వృద్ధ హిందువును చిత్రహింసలకు గురిచేశాడు. అతనికి న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఉద్యమం మొదలు కావడంతో ఆ పోలీసు కానిస్టేబుల్‌ను అరెస్టు చేశారు. శుక్రవారంనాడు వయో వృద్ధుడైన గోకుల్ దాస్‌ను చిత్రహింసలకు గురిచేసి గాయపరిచాడన్న ఆరోపణలపై ఘోట్కి జిల్లాలో పని చేస్తున్న అలీ హసన్ అనే పోలీసు కానిస్టేబుల్‌ను అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. వయోవృద్ధుడైన తన తాతను తీవ్రంగా కొట్టాడంటూ గోకుల్ దాస్ మనవడు కానిస్టేబుల్‌పై ఫిర్యాదు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. శరీరంపై చిత్రహింసలకు గురి చేసిన గుర్తులతో దాస్ ఫోటోలు సోషల్ మీడియాలో దావానలంలాగా వ్యాప్తించడంతో హిందువైన దాస్‌కు న్యాయం జరిగేలా చూడాలని సింధ్ రాష్ట్ర పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎడి ఖావాజా ఆదేశించారు.

చిత్రం కానిస్టేబుల్ దాడిలో గాయపడ్డ గోకుల్ దాస్