అంతర్జాతీయం

తాలిబన్ల దాడిలో 11 మంది అఫ్గాన్ పోలీసులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాందహార్, డిసెంబర్ 17: ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. తాజాగా ఆదివారం జరిపిన దాడిలో ఏకంగా 11 మంది పోలీసు అధికారులు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్లకు మంచి పట్టున్న హెల్మంద్ ప్రావెన్స్‌లో ఈ దారుణ కృత్యానికి తెగబడ్డారు. అయితే ఉగ్రవాదులపై జరిపిన ఎదురు కాల్పుల్లో 15 మంది తాలిబన్లు కూడా మరణించారని ఆ ప్రావెన్స్ పోలీసు అధికారి ఘ్ఫాన్ సఫీ విలేఖరులకు తెలిపారు. ఆఫ్గనిస్తాన్‌లో అమెరికా ఆధ్వర్యంలో పనిచేసిన నాటో దళాలు ఉపసంహరించుకున్న తర్వాత ఉగ్రవాదుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. ఇలావుండగా మరో ఘటనలో కాందహార్‌లో నాటో దళాలపై జరిగిన ఉగ్రవాద దాడిలో ఒక మహిళ మరణించగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.