అంతర్జాతీయం

క్వెట్టా చర్చిపై ఉగ్ర పంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచి/ ఇస్లామాబాద్, డిసెంబర్ 17: పాక్ మరోసారి రక్తమోడింది. ఆదివారం ఓ చర్చిపై మిలిటెంట్లు విసిరిన పంజాకు ఎనిమిది మంది ప్రాణాలు వదిలేశారు. 44మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 9మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కొద్దిరోజుల్లో క్రిస్మస్ పండుగ జరుపుకోనున్న తరుణంలో ఆదివారం ప్రార్థనలకు హాజరైన క్రిస్టియనే్ల లక్ష్యంగా మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు. ఆగ్నేయ పాక్‌లోని క్వెట్టా నగరం జోర్గాన్ రోడ్డులోని బెతెల్ మెమోరియల్ చర్చిపై ఈ దాడి జరిగింది. చర్చిలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తూ ఒక ఉగ్రవాది పోలీస్ కాల్పుల్లో మరణిస్తే, మరో ఉగ్రవాది చర్చిలోకి దూసుకెళ్లి తనను తను పేల్చేసుకున్నాడు. క్రిస్టియనే్ల లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. ‘్భరీ ఆయుధాలతో వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి కారణంగా భావిస్తున్నాం. తొలుత ఒక ఉగ్రవాది చర్చిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా భద్రతా దళాలు కాల్చి చంపేశాయి. సమీపంలోనేవున్న మరో ఉగ్రవాది పెద్దఎత్తున కాల్పులు జరుపుతూ చర్చిలోకి ప్రవేశించాడు. తనను తను పేల్చేసుకుని విధ్వంసం సృష్టించాడు’ అని బలూచిస్తాన్ హోంమంత్రి మీర్ సర్ఫారాజ్ బుగ్టి వెల్లడించారు. తొలుత చర్చిలోని క్రిస్టియన్లను బందీలుగా తీసుకునే ప్రయత్నం చేశారని, అయితే భద్రతా దళాలు వారి ఆటలు సాగనివ్వలేదని మీర్ వెల్లడించారు. మానవ బాంబు దాడి జరిగిన సమయంలో చర్చిలో 400మంది వరకూ ప్రార్థనల్లో ఉన్నట్టు బలూచిస్తాన్ ఐజీ మోజ్జం అన్సారీ చెప్పారు. చర్చి భద్రతకు కేటాయించిన పోలీసులు ప్రాణాలొడ్డి ఉగ్రవాద పన్నాగాన్ని అడ్డుకోవడంతో పెద్ద ముప్పు తప్పిందన్నారు. ఇది ఉగ్రవాదులు పక్కా ప్రణాళికతో చేసిన దాడిగా అభివర్ణించారు. ఆస్పత్రి వైద్యుడు వసీం బేగ్ వివరాలందిస్తూ 8మంది సంఘటనా ప్రాంతంలోనే చనిపోయారని, తీవ్రంగా గాయపడిన 44మందికి వైద్య చికిత్స అందిస్తున్నామన్నారు. వీరిలో 9మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. చర్చి ఫేస్‌బుక్ పేజీ ప్రకారం క్రిస్టమస్ మాసంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సండే స్కూల్ క్రిస్టమస్ ప్రోగాం నిర్వహిస్తుండగా ఉగ్ర దాడి జరిగింది. ఘాతుకానికి పాల్పడింది ఎవరన్నది ఇంతవరకూ తెలియకపోయినా, క్రిస్టియన్లపై దాడులకు తెగబడుతున్న తాలిబాన్ల పనే అయివుంటుందని అనుమానిస్తున్నారు. అయితే, సంఘటనకు సంబంధించి ఐజీ అన్సారీ అందించిన వివరాలు ప్రకారం ముగ్గురు మిలిటెంట్లు దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఒకరిని గేటువద్దే పోలీస్ దళాలు మట్టుబెడితే, మరో మిలిటెంట్ తనను తను పేల్చేసుకుని విధ్వంసం సృష్టించాడు. ఆ గందరగోళంలో మూడో మిలిటెంట్ తప్పించుకున్నాడని, పోలీస్ దళాలు అతని ఆచూకీ కోసం వెతుకుతున్నాయని అన్సారీ వెల్లడించారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావెద్ బజ్వా చర్చిపై మిలిటెంట్ దాడిని ఖండించారు. క్రిస్టమస్ పండుగ సమయంలో క్రిస్టియన్లను టార్గెట్ చేసి మతకల్లోలం లేపేందుకే మిలిటెంట్లు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
చిత్రాలు....తాలిబన్ల దాడిలో రక్తసిక్తమైన క్వెట్టాలోని చర్చి.
*దాడి అనంతరం చర్చిలోనున్న పిల్లలను బయటకు తీసుకువస్తున్న పోలీసులు