అంతర్జాతీయం

జాదవ్ తల్లి, భార్యకు త్వరలో వీసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, డిసెంబర్ 17: పాకిస్తాన్ జైలులో ఉన్న భారత వాయుసేన మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌ను కలుసుకునేందుకు అతని తల్లి, భార్యలకు వీసాలను కొద్దిరోజుల్లో పంపిస్తామని ఆ దేశ విదేశాంగ కార్యాలయం ప్రతినిధి మహమ్మద్ ఫైజల్ ఆదివారం ట్విట్టర్‌లో తెలిపారు. వీసాలు మంజూరు చేయాల్సిందిగా ఆ ఇద్దరూ పంపిన దరఖాస్తులు తమకు అందాయని, వీసాలు తయారైన వెంటనే వారికి అందజేస్తామన్నారు. మానవతాదృక్పథంతో జాదవ్ తల్లి, భార్యకు వీసాలు మంజూరు చేస్తున్నామన్నారు. వీసాలను పంపేందుకు నిర్ణీత గడువు ఏదీ లేదన్నారు. కాగా, అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) ఆశ్రయించేందుకు జాదవ్‌కు అవకాశం ఇవ్వాలన్న భారత్ విజ్ఞప్తిని పాకిస్తాన్ తిరస్కరించింది. ‘వియన్నా ఒప్పందం’ ప్రకారం ఐసీజేను ఆశ్రయించేందుకు గూఢచారులకు వెసలుబాటు లేదని పాకిస్తాన్ పేర్కొంది. ఈ మేరకు ఐసీజేకు ఆ దేశం కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. జాదవ్ సాధారణ పౌరుడు కాదని, ఉద్దేశ పూర్వకంగా తమ దేశం పట్ల గూఢచర్యం చేసి వెన్నుపోటు చర్యలకు పాల్పడినట్లు పాక్ వాదిస్తోంది. గూఢచర్యం, ఉగ్రవాదం నేరాలపై జాదవ్ (47)కు పాక్ మిలటరీ కోర్టు ఈ ఏడాది ఏప్రిల్ మరణశిక్షను ఖరారు చేసింది. భారత్ విజ్ఞప్తి మేరకు అంతర్జాతీయ న్యాయస్థానం జోక్యం చేసుకోవడంతో అతనికి మరణశిక్ష వాయిదా పడింది. బలొచిస్తాన్ ప్రావిన్స్‌లో గూఢచర్యం, ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుండగా తమ సైనికులు జాదవ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పాక్ చెబుతోంది. అయితే, ఇరాన్‌లో ఉండగా జాదవ్‌ను పాక్ సైనికులు అపహరించుకుపోయారని భారత్ ఆరోపిస్తోంది. భారత్ చేసిన పలు విజ్ఞప్తులకు స్పందించిన పాక్, జైలులో ఉన్న జాదవ్‌ను అతని భార్య, తల్లి కలుసుకునేందుకు అనుమతి మంజూరు చేసింది. ఈనెల 25న జాదవ్‌ను అతని తల్లి, భార్య కలుసుకునేందుకు వీసాలను మంజూరు చేస్తామని పాక్ ఇదివరకే హామీ ఇచ్చింది. న్యూఢిల్లీలోని పాక్ హైకమిషనర్ జాదవ్ తల్లి, భార్యకు వీసాలు అందజేస్తారు.