అంతర్జాతీయం

లష్కరే, జమాత్.. దేశభక్తికి ప్రతీకలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ/లాహోర్, డిసెంబర్ 17: నిషేధిత ఉగ్రవాద సంస్థలు ‘లష్కరే తోయిబా’, ‘జమాత్ ఉద్ దవా’ దేశభక్తికి ప్రతీకలని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ప్రశంసలు కురిపించారు. పాకిస్తాన్ రక్షణ, భద్రత కోసం రాబోయే ఎన్నికల్లో ఆ సంస్థలను కూటమిలో చేర్చుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. పాకిస్తాన్‌లోని ఓ న్యూస్ చానల్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో 74 ఏళ్ల ముషారప్ మాట్లాడుతూ, ‘లష్కరే, జమాత్ సంస్థల కార్యకర్తలు నిజమైన దేశభక్తులు.. కాశ్మీర్ స్వేచ్ఛ కోసం వారు ప్రాణాలను త్యాగం చేస్తున్నారు..’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబయి పేలుళ్లకు సూత్రధారి అయిన జెయుడి అధినేత హఫీజ్ సరుూద్ నిజమైన దేశభక్తుడని ఆయన కీర్తించారు. లష్కరే తోయిబా సంస్థకు, సరుూద్‌కు తాను పెద్ద మద్దతుదారునని ఆయన గత నెలలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇపుడు లష్కరే, జమాత్‌లను దేశభక్తికి ప్రతీకలంటూ తన స్వరం మరింతగా పెంచారు. ‘వాళ్లు (లష్కరే, జమాత్) మంచివాళ్లు.. వారికి ప్రజల మద్దతు పెద్దఎత్తున ఉంది.. హఫీజ్ రాజకీయ పార్టీ ప్రారంభిస్తే ఎదురే ఉండదు.. హఫీజ్ పార్టీ మాతో పొత్తుకు ఆలోచిస్తే నేను సిద్ధం..’ అని ముషారఫ్ అన్నారు.
2008లో ముంబయి పేలుళ్లలో 166 మంది మరణించాక లష్కరే తోయిబాను నిషేధించిన సంగతి తెలిసిందే. జెయుడిని విదేశీ ఉగ్రవాద సంస్థగా 2014లో అమెరికా నిషేధించింది. కాగా, వచ్చే ఏడాది జరిగే పాక్ సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన నేతృత్వంలో ఓ మహాకూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు ముషారఫ్ గతనెలలో ప్రకటించారు. అయితే, ఆయన ప్రతిపాదనను చాలా రాజకీయ పార్టీలు ఆదిలోనే తిరస్కరించాయి. ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్న ఆయన- తాను ఎలాంటి ఆరోపణలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమేనని గతంలోనే ప్రకటించారు. 1999లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఆయన తొమ్మిదేళ్ల పాటు పాకిస్తాన్‌ను నియంతలా పాలించారు. ఆయనపై పాక్ కోర్టుల్లో పలు కేసులు విచారణ దశలో ఉన్నాయి.
కాశ్మీర్‌కు స్వేచ్ఛను ప్రసాదించడమే తమ ధ్యేయమని ముంబయి పేలుళ్లకు సూత్రధారి, ‘జమాత్ ఉద్ దవా’ నేత హఫీజ్ సరుూద్ ప్రకటించాడు. 1971లో జరిగిన భారత్-పాక్ యుద్ధంలో పాక్ ఓటమికి ప్రతీకార చర్యగా కాశ్మీర్‌కు విముక్తి కల్పిస్తామని లాహోర్‌లో శనివారం రాత్రి జరిగిన సభలో ఆయన పేర్కొన్నాడు. 1971లో పాక్ ఓటమి నేపథ్యంలో బంగ్లాదేశ్ అవతరించిందని ఆయన చెప్పుకొచ్చాడు. డిసెంబర్ 16వ తేదీన భారత్ ‘విజయ్ దివస్’ను, బంగ్లాదేశ్ ‘విక్టరీ డే’ను జరుపుకున్న సందర్భంగా హఫీజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 2018లో జరిగే పాకిస్తాన్ సాధారణ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని హఫీజ్ ఇటీవల ప్రకటించాడు. అంతర్జాతీయ ఉగ్రవాది అయిన హఫీజ్‌పై 66 కోట్ల రూపాయల రివార్డు ఉంది. గృహనిర్బంధంలో ఉన్న హఫీజ్‌ను ఇటీవలే పాక్ ప్రభుత్వం విడుదల చేసింది.