అంతర్జాతీయం

తూటాతో శాంతికి తూట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 13: ఓర్లాండో గే క్లబ్‌లో ఆదివారం జరిగిన మారణకాండ అమెరికాను కకావికలు చేస్తోంది. గుండెలు పిండేస్తున్న తుపాకీ సంస్కృతికి అంతం ఎప్పుడంటూ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డ దుండగుడు ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్ ప్రతినిధి అని భావిస్తున్నా, అతను ఖలీఫా వీరుడని ఐసిస్ ప్రకటించుకున్నా, అమెరికాను వణికిస్తున్నది మాత్రం దేశంలో విచ్చలవిడిగా పెట్రేగిపోతున్న గన్ కల్చర్. ఓర్లాండో ఘటన దేశంలో మరోసారి గన్ కంట్రోల్ చట్టాల ఆవశ్యకత గురించి విస్తృతమైన చర్చకు నాంది పలికింది. గన్ కంట్రోల్ చట్టాల నియంత్రణకు శాసనకర్తలపై ఒత్తిడి పెరుగుతోంది. దేశంలో పెచ్చుమీరుతున్న హింసా ప్రవృత్తి అనేది దేశంలో శాసన వ్యవస్థలకు, నిఘా సంస్థలకు అతిపెద్ద కౌంటర్ టెర్రరిజం సవాలు అని ఫ్లోరిడా సెనెటర్ మార్కొ రూబియో అన్నారు. ‘ఇస్లామిక్ ఉగ్రవాదులతో ఈ దేశం తీవ్రమైన ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. విద్వేషపూరిత సిద్ధాంతాలు హద్దులు లేకుండా విస్తరిస్తున్నాయ. ఇది దేశానికి, ప్రపంచానికీ ప్రమాదకరమే’ అని హౌస్ స్పీకర్ పాల్ రియాన్ అన్నారు. ఎల్‌జిబిటి సమాన హక్కుల సంస్థ దేశంలో కఠినమైన గన్ కంట్రోల్ చట్టాలను తీసుకురావాలని వాదిస్తోంది.
‘ఇలాంటి విషాదాలు అమెరికాలో చాలా సామాన్యమైనాయి. ఇక ఇలాంటి ఘటనలు ఎట్టి పరిస్థితిలోనూ పునరావృతం కారాదు. తుపాకీ హింసను నియంత్రించటానికి అవసరమైన అన్ని అవకాశాలను అమెరికా కాంగ్రెస్ పరిశీలించాలి. ఈ రకమైన హింసకు అర్థవంతమైన పరిష్కారాన్ని కనుగొనలేక ఇప్పటికే అమెరికన్లు విసుగుతో ఉన్నారు’ అని సెనెటర్ టామ్ కార్పర్ వ్యాఖ్యానించారు. 9/11 తరువాత అత్యంత దారుణమైన హింసాత్మక ఘటనగా భావిస్తున్న ఓర్లాండో కాల్పుల వ్యవహారం ఎఫ్‌బీఐ విచారణలో ఐసిస్ చర్యే అని తేలితే, కాల్పులు జరిపిన ఒకే ఒక్క దుండగుడు ఐసిస్ తోడేలు అనే నిర్ధారణ అయితే మాత్రం అమెరికాకు ఉగ్రవాదం ముప్పు ఎంత ప్రమాదకర స్థాయిలో విస్తరించిందో గ్రహించవచ్చని మరో సెనెటర్ సుసాన్ కొలిన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఇండియానాలో ఆయుధాలు కలిగిన వ్యక్తిని అమెరికా పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.
ఒబామా రాజీనామా చేయాలి: ట్రంప్
వాషింగ్టన్: ఓర్లాండో కాల్పుల ఘటనపై అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందించిన తీరును అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ నామినీ డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఒబామా తన ప్రసంగంలో ‘అతివాద ఇస్లామిక్ తీవ్రవాదం’ (రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజం) అన్న పదం వాడకపోవటం సరైంది కాదని.. ఆయన అలా అననప్పుడు ఒబామా రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ దుండగుడు మాటిన్ కాల్పులు జరుపుతూ ‘అల్లాహు అక్బర్’ అని నినదించిన సంగతి గుర్తెరగాలని, అయినప్పటికీ ఒబామా ఇస్లామిక్ ఉగ్రవాదం పట్ల మెతకగా వ్యవహరించటం దారుణమని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఓర్లాండో నైట్ గే క్లబ్‌పై దాడి తమదేనని ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. క్లబ్‌పై దాడి చేసిన ఒమర్ మాటిన్‌ను ఖలీఫా వీరుడిగా అభివర్ణించింది. 29 ఏళ్ల మాటిన్ ఆఫ్గానిస్తాన్ నుంచి వలసవచ్చిన ముస్లిం అమెరికన్. ఇతనికి ఐసిస్‌తో ఉన్న సంబంధాలపై అమెరికా దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి. ‘అమెరికాలోని నైట్‌క్లబ్‌లో చొరబడి దాడి చేసేందుకు ఖలీఫా వీరుడైన మాటిన్‌కు దేవుడు అనుమతిచ్చాడు’ అని ప్రకటనలో పేర్కొంది.
విచ్చలవిడి ఆయుధాలపై పోప్ ఆందోళన
రోమ్: ప్రపంచంలో విచ్చలవిడిగా, ఎలాంటి నియంత్రణ లేకుండా ఆయుధాలను సరఫరా చేస్తుండటం వల్లనే ఓర్లాండో ఘటనలు జరుగుతున్నాయని పోప్ ఫ్రాన్సిస్ అభిప్రాయపడ్డారు. ‘ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయన్నది సమస్య కాదు. కానీ, ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో మాత్రం ఆయుధాలు విశృంఖలంగా సరఫరా అవుతున్నాయి’ అని పోప్ అన్నారు.

చిత్రం ఓర్లాండో మృతులకు కాల్ అండర్సర్ పార్క్ వద్ద నివాళులర్పిస్తున్న దృశ్యం