అంతర్జాతీయం

భారత్‌కన్నా అర్హత పాకిస్తాన్‌కే ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూన్ 13: అణు సరఫరాదారుల గ్రూపు (ఎన్‌ఎస్‌జి)లో సభ్యత్వానికి సంబంధించి భారత్‌కన్నా తనకే బలమైన అర్హతలున్నాయని దాయాది దేశం పాకిస్తాన్ సోమవారం ప్రకటించింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పిటి)పై సంతకం చేయని దేశాలు ఎన్‌ఎస్‌జిలో చేరికకు సంబంధించి ఏకీకృత ప్రాతిపదికను రూపొందిస్తే భారత్‌కన్నా తమ దేశానికే పటిష్ఠమైన అర్హతలున్నాయని పాకిస్తాన్ ప్రధానమంత్రికి విదేశీ వ్యవహారాల సలహాదారు అయిన సర్తాజ్ అజీజ్ పేర్కొన్నారు. ఎన్‌పిటిపై సంతకం చేయని దేశాలకు ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం కల్పించడానికి ఏకీకృత ప్రాతిపదికను రూపొందించడంపై పాకిస్తాన్ అనేక దేశాలతో సంప్రదింపులు జరుపుతోందని వెల్లడించారు. ఒకవేళ ఎన్‌ఎస్‌జి ఇలాంటి ఏకీకృత ప్రాతిపదికను రూపొందిస్తే భారత్‌కన్నా పాకిస్తాన్‌కే బలమైన అర్హతలున్నాయని సర్తాజ్ అజీజ్ ‘డాన్ న్యూస్’కు చెప్పారు.