అంతర్జాతీయం

సాయం లేకున్నా స్నేహం వదలుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచి, జనవరి 7: ఎంతకాదన్నా, అమెరికా పెద్దనే్న. సాధ్యమైనంత వరకూ ఆ దేశంతో సంబంధాలు కొనసాగించాలన్నదే ఇస్లామాబాద్ యోచన అని పాక్ విదేశాంగ కార్యదర్శి తెహ్‌మినా జంజ్వా స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవడంలో ఇస్లామాబాద్ పూర్తిగా విఫలమైందని భావిస్తోన్న అమెరికా, 2 బిలియన్ డాలర్ల రక్షణ సాయాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. అయితే, యూఎస్ నిర్ణయంపై ప్రశ్నించినపుడు ఆచితూచి మాట్లాడిన జంజ్వా, ‘సాధ్యమైనంత వరకూ అమెరికాతో సంబంధాలు కొనసాగిస్తాం. ఇంతకుమించిన ఆలోచన మరొకటి లేదు. పైగా అమెరికా అగ్రరాజ్యమే కాదు, దక్షిణాసియాపై దాని ప్రభావం ఎంతైనా ఉంది. మరో కోణంలో చెప్పుకోవాలంటే అమెరికా మాకు పొరుగు దేశం కూడా’ అని ఆమె వ్యాఖ్యానించారు. కరాచీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఐబీఎ) నేతృత్వంలో ఆదివారం జరిగిన ‘పాక్ విదేశాంగ విధాన సమస్యలు’ అంశంపై ఆమె మాట్లాడారు. పాక్ వైఖరిపై జనవరి 1న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ట్వీట్లు చేయడాన్ని ప్రస్తావిస్తూ ‘ఒకందుకు మంచే జరిగింది. ట్రంప్ ఎందుకంత తీవ్ర వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో పరిస్థితులను మేం విశే్లషించుకుంటున్నాం’ అని జంజ్వా వ్యాఖ్యానించినట్టు డాన్ పేర్కొంది. ‘అమెరికా ప్రతినిధి (జనరల్ మాటిస్)తో పాక్ సమావేశం జరిగే ముందు వరకూ వాతావరణం బాగానే ఉంది. అయితే, జనవరి 1న ప్రపంచం మొత్తం ఆసక్తిని ప్రదర్శించే రెండు ట్వీట్లు వైట్‌హౌస్ నుంచి వెలువడ్డాయి. అందులో ఒకటి ఇరాన్‌కు సంబంధించి, రెండోది పాక్‌కు సంబంధించింది’ అని ఆమె విశే్లషించారు. ‘తెల్లవారుఝామున 4 గంటల సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్, పాక్ గురించి ఎందుకు ఆలోచించాల్సి వచ్చింది?’ అన్న విషయాన్ని సమీక్షించుకున్నట్టు జంజ్వా పేర్కొన్నారు. ‘ఇరాన్‌లో పాలన గాడి తప్పుతోంది కనుక, ట్రంప్ దృష్టి పెట్టడంలో అర్థం ఉంది. కానీ, ఎలాంటి గందరగోళం లేని పాక్ పరిస్థితిపై ట్రంప్ ఎందుకు ట్వీట్ చేశారన్నది పెద్ద క్వొశ్చన్ మార్క్’ అని ఆమె అన్నారు. ‘అమెరికా మిత్రులకు ఒక విషయం స్పష్టం చేయదలచుకున్నాం. దేశంలో ఎక్కడా ఉగ్రవాద సంఘటిత పరిస్థితులు లేవు. ఒకవేళ మీకు ఏదైనా సమాచారం అంది మీ గూఢచర్య విభాగం ద్వారా పంచుకుంటే, కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెబుతున్నాం’ అని జంజ్వా స్పష్టం చేసినట్టు డాన్ పత్రిక వెల్లడించింది. ‘తీసుకోవడమే తప్ప యూఎస్‌కు పాక్ ఇచ్చిందేమీ లేదు. పాక్ మమ్మల్ని మోసం చేసింది. అదొక అబద్ధాల కోరు’ అంటూ ట్రంప్ తన ట్వీట్‌లో తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే.

చిత్రం..పాక్ విదేశాంగ కార్యదర్శి తెహ్‌మినా జంజ్వా