అంతర్జాతీయం

ఎన్‌ఎస్‌జీకి భారత్ దగ్గరవుతోంది.. జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూన్ 16: అణు ఇంధన సరఫరా దేశాల గ్రూప్ (ఎన్‌ఎస్‌జి)లో సభ్యత్వం సాధించే దిశగా భారత్ దూసుకుపోతోందని చైనా అధికార మీడియా అక్కడి ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఎన్‌ఎస్‌జిలోకి భారత్ చేర్చుకోవటం వల్ల దక్షిణాసియాలో వ్యూహాత్మక సంతులనం దెబ్బతినే ప్రమాదం ఉందని అక్కడి మీడియా పేర్కొంది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా, స్విట్జర్లాండ్, మెక్సికోలలో పర్యటించి ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వానికి మద్దతును కూడగట్టారని చైనా మీడియా గ్లోబల్ టౌమ్స్ వ్యాఖ్యానించింది. ఫ్యుగ్జియాకియాంగ్ అనే పరిశోధక విద్యార్థి దీనికి సంబంధించి విపులమైన వ్యాసాన్ని రాశారు. ‘ఎన్‌ఎస్‌జీలో భారత్ సభ్యురాలు అయితే, పౌర అణు ఇంధన వ్యాపారం ద్వారా ఆ దేశానికి అణుశక్తిగా చట్టబద్ధమైన ఆమోదం లభిస్తుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకసారి భారత్‌కు సభ్యత్వం లభిస్తే పౌర అణు ఇంధన పరిజ్ఞానాన్ని, ఇంధనాన్ని భారత్ కొనుగోలు చేసి వాటిని సైనిక అవసరాల కోసం భద్రపరుచుకుంటుందని హెచ్చరించారు. ఎన్‌ఎస్‌జిలో చేరడం వెనుక భారత ప్రధాన లక్ష్యం అణు సామర్థ్యంలో పాకిస్తాన్‌పై పైచేయి సాధించటమేనని స్పష్టం చేశారు. దీనివల్ల భారత్, పాకిస్తాన్‌ల మధ్య అణు సంతులనం దెబ్బతింటుందని హెచ్చరించారు.