అంతర్జాతీయం

భారతీయుడికి జాక్‌పాట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయి, జనవరి 8: ఇక్కడ ఓ కంపెనీలో బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న భారతీయుడు లాటరీలో జాక్‌పాట్ కొట్టాడు. 21 మిలియన్ల ధిర్హాం అంటే 3.2 మిలియన్ల అమెరికా డాలర్ల మనీ ప్రైజ్ లభించింది. 2002 నుంచి హరికృష్ణ వి నాయర్ (42) కుటుంబంతోపాటు దుబాయినే ఉంటున్నాడు. అబుదాబీ ప్రభుత్వం ఏటా తీసే డ్రాలో ఇప్పటికి పదిమంది భారతీయులకు మనీ ప్రైజ్ వచ్చింది. అందులో ఎనిమిది మంది ఒక్కొక్కరు మిలియన్ ధిర్హాంలు వచ్చాయి. డాలర్ల లెక్కన చూస్తే 2.7 లక్షలు. అక్టోబర్ మెగా డ్రా సంగతది. ఆగస్టులో మరొక భారతీయుడికి ఏకంగా 5 మిలియన్ ధిర్హాంల నగదు బహుమతి పొందాడు. ఇంతకుముందు కూడా రెండు సార్లు టికెట్లు కొన్నానని అయితే ఎప్పుడూ తగల్లేదని నాయర్ చెప్పాడు. డ్రాలో జాక్‌పాట్ కొట్టినట్టు ఆదివారం తెలిసి అతడి కుటుంబం ఉబ్బితబ్బిబ్బయింది. ప్రతిసారీ కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లానని ఆశపడతాని అయితే ఈసారి ప్రైజ్‌మనీతో ఆ కోరిక తీర్చుకుంటానని ఖలీజ్ టైమ్స్‌కు చెప్పాడు. త్వరలోనే దానికి ప్లాన్ చేసుకుంటానని కేరళకు చెందిన నాయర్ తెలిపాడు. ‘నా ఏడేళ్ల కుమారుడికి మంచి చదువు చెప్పిస్తా. భారత్‌లో మరొక ఇల్లు కొనుగోలు చేస్తా. నా తల్లిని, అత్తగారిని మరింత బాగా చూసుకుంటా’ అని బిజినెస్ మేనేజర్ పేర్కొన్నారు. ‘పేద ప్రజలను ఆదుకోవాలని ఎప్పుడూ అనుకుంటాను. దేవుని దయవల్ల ప్రైజ్‌మనీ వచ్చింది. ఇప్పుడు అందులో కొంతమొత్తం ధార్మిక కార్యక్రమాలకు వెచ్చిస్తా’ అని నాయర్ తెలిపారు. తన భర్త ఆఫీసు ఉద్యోగులు డ్రా వార్త చెప్పగానే ఎంతో ఉద్వేగానికి లోనయ్యానని నాయర్ భార్య తెలిపింది. బిజినెస్ డెవలప్‌మెంట్‌గా పనిచేస్తున్న తన భర్త నగదును ఎలా వినియోగించాలో బాగా తెలుసని ఆమె చెప్పుకొచ్చారు.