అంతర్జాతీయం

హెచ్-1బీపై ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 9: భారతీయులకు గొప్ప ఊరట లభించేలా హెచ్-1బీ వీసా పొడిగింపు విధానంలో సంస్కరణలకు స్వస్తి పలుకుతూ ట్రంప్ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్-1బీ వీసాదారులను తమ దేశం నుంచి వెనక్కి పంపే ప్రతిపాదన ఏదీ లేదంటూ అమెరికా ప్రకటించింది. హెచ్-బీ వీసా పొడిగింపు నిబంధనల్లో సవరణలు తెస్తామని అమెరికా అధ్యక్షుడు ఇటీవల ప్రకటించడంతో ఆ దేశంలోని విదేశీ ఐటీ ఉద్యోగులు ముఖ్యంగా భారతీయులు తీవ్ర ఆందోళనకు లోనైన సంగతి తెలిసిందే. ట్రంప్ ప్రతిపాదించిన సవరణలు అమలులోకి వస్తే సుమారు ఏడున్నర లక్షల మంది భారతీయులు స్వదేశానికి రావల్సి వస్తుంది. అయితే, సవరణలకు స్వస్తి పలుకుతున్నట్లు ట్రంప్ యంత్రాంగం ప్రకటించడంతో అక్కడ గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న హెచ్-1బీ వీసాదారులకు ఇపుడు ఉపశమనం లభించింది.
వీసా పొడిగింపును నిరాకరించి, హెచ్-1బీ వీసాదారులను అమెరికా నుంచి బలవంతంగా వెనక్కిపంపించాలనే నిబంధనలను తాము పరిగణనలోకి తీసుకోవడం లేదని ‘యుఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) మీడియా సంబంధాల అధికారి జొనాతన్ వితింగ్టన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఏసీ 21లోని సెక్షన్ 140(సి) మేరకు హెచ్-1బీ వీసాదారులకు ఆరేళ్లకు పైగా పొడిగింపు లభిస్తుంది. దీనిలో మార్పులు చేసే ప్రతిపాదనలను తాము పరిగణనలోకి తీసుకోబోమని యూఎస్‌సీఐఎస్ స్పష్టం చేసింది. ఒకవేళ ఏవైనా సవరణలు చేస్తే హెచ్-1బీ వీసాదారులు అమెరికా నుంచి వెనక్కి వెళ్లకుండా ఉండేందుకు ఏసీ 21లోని మరో సెక్షన్ 106(ఎ)-(బీ) ద్వారా ఏడాది పొడిగింపునకు సంబంధిత కంపెనీలు అభ్యర్థించే అవకాశం కూడా ఉందని జొనాతన్ వెల్లడించారు.
ట్రంప్‌పై యంత్రాంగంపై ఒత్తిడి
హెచ్-1బీ వీసాలపై పెద్ద సంఖ్యలో భారతీయులను నియమించుకున్న అమెరికాలోని అనేక ఐటీ కంపెనీలు వీసాల విషయమై సవరణలు తీసుకురావద్దని ట్రంప్ యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చాయి. వీసాల పొడిగింపును రద్దు చేయాలన్న ట్రంప్ యోచనను ఇప్పటికే అమెరికాలోని పలువురు శాసనకర్తలు, న్యాయవాదులు, పారిశ్రామిక ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించారు. వీసా సవరణలు అమలులోకి వస్తే నిపుణులు, సమర్థులు అమెరికాను వదిలివెళ్లే పరిస్థితి తలెత్తి, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుందని వారు హెచ్చరించారు. నిపుణుల కొరత వల్ల దుష్పరిణామాలు తప్పవని వారు అభిప్రాయపడ్డారు. అమెరికాలో స్థానికులకే ఉద్యోగావకాశాలంటూ దేశాధ్యక్ష ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ట్రంప్, అధికార పగ్గాలు చేపట్టాక వీసా నిబంధనల్లో ఆంక్షలు విధించాలని యత్నించారు. గత జనవరి నుంచి ఈ దిశగా ట్రంప్ హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. వీసా నిబంధనలను సవరిస్తే అమెరికా- భారత్‌ల మధ్య సంబంధాలకు విఘాతం కలుగుతుందని భారత ఐటీ రంగానికి చెందిన ‘సాఫ్ట్‌వేర్, సర్వీసెస్ కంపెనీల జాతీయ సంఘం’ (నాస్‌కామ్) ఆందోళన వ్యక్తం చేసింది.