అంతర్జాతీయం

కేసులు కాదు.. అవార్డు ఇవ్వండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జనవరి 9: ‘ఆధార్’ సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో విక్రయిస్తున్నట్లు పరిశోధనాత్మక వార్తా కథనాన్ని అందించిన జర్నలిస్టుకు అవార్డు ఇవ్వడానికి బదులు కేసులు పెట్టడం దారుణమని అమెరికాకు చెందిన సిఐఏ మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ స్నోడెన్ ‘ట్విట్టర్’లో పేర్కొన్నారు. ‘ఆధార్’ వివరాలకు గోప్యత లేదంటూ చండీగఢ్‌కు చెందిన ‘ది ట్రిబ్యూన్’ పత్రికకు చెందిన మహిళా జర్నలిస్టు సాహసోపేతంగా వార్తా కథనాన్ని అందించారని ఆయన అభినందించారు. ఇంతటి ఘనతను సాధించిన జర్నలిస్టుకు అవార్డుతో సత్కరించాలే తప్ప, ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణకు ఆదేశించడం ప్రభుత్వానికి తగదని ఆయన అన్నారు. భారత్‌లో వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్న విధానాలను సంస్కరించాలన్నారు. ‘న్యాయం చేయాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి నిజంగా ఉంటే సంస్కరణలు చేపట్టాలి, గోప్యతకు భంగం కలిగించేవారిని అరెస్టు చేయాలి, ఇది జరగాలంటే ‘ఆధార్’ వ్యవస్థను పర్యవేక్షిస్తున్న ‘యుఏడిఏఐ’ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. అమెరికా గూఢచార సంస్థ రహస్య సమాచారాన్ని బహిర్గతం చేసి గతంలో సంచలనం సృష్టించిన 34 ఏళ్ల స్నోడెన్ 2013 నుంచి రష్యాలో ఉంటున్నారు. కంప్యూటర్ రంగంలోనూ అనుభవం ఉన్న ఆయన అమెరికాలో ఉన్నపుడు కాంట్రాక్టర్‌గా పనిచేశారు. ఓ నిఘా సంస్థలో పనిచేస్తూ కీలక రహస్యాలను తెలుసుకుని పత్రికలకు అందించేవారు. భారత్‌లో ‘ఆధార్’ వివరాలను విక్రయిస్తున్నారన్న వార్తా కథనాన్ని చదివి స్నోడెన్ స్పందించారు.